woman finds rare diamond : పార్కులో వాకింగ్ చేస్తుంటే వృద్ధురాలికి దొరికిన అరుదైన వజ్రం

పార్కులో సరదాగా వాకింగ్ చేస్తున్న ఓ వృద్ధ జంటకు అరుదైన వజ్రం దొరికింది.

woman finds rare diamond : పార్కులో వాకింగ్ చేస్తుంటే వృద్ధురాలికి దొరికిన అరుదైన వజ్రం

Old Woman Finds Rare Diamond 

US old woman finds rare diamond  : అదృష్టం వరిస్తే క్షణంలో జీవితం మారిపోతుంది. అలా సరదాగా పార్కులో వాకింగ్ చేస్తున్న ఓ వృద్ధ దంపతులకు అదృష్టం వరిచింది. మిణుకు మిణుకు మంటు మెరిసింది ఏదో రాయి అనుకుంటే అరుదైన వజ్రం అని తెలిసి వారిద్దరు షాక్ అయ్యారు. తమ అదృష్టాన్ని తామే నమ్మలేకపోయారు. టైంపాస్ కోసం పార్కుకు వెళ్లిన ఓ వృద్ధ దంపతులకు అరుదైన వజ్రం దొరికింది.

అమెరికాలోని వృద్ధ దంపతులు నొరీన్ రెడ్‌బర్గ్, ఆమె భర్త మైకేల్ రిటైర్డ్ అయ్యారు. వారికి ప్రతీరోజు వాకింగ్ చేయటం అలవాటు. ఒక్కరోజు కూడా వాకింగ్ మానరు. ఇద్దరు చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటే వాకింగ్ చేయటం అంటే ఇద్దరికి చాలా చాలా ఇష్టం. ఆ ఇష్టమే వారికి ఓ అరుదైన వజ్రం దొరికేలా చేసింది. రిటైర్ అవ్వటంతో ఇద్దరు టైంపాస్ కోసం వాకింగ్ కు వెళుతుంటారు. అలా సరదా కోసం ఓ రోజు వజ్రాలకు ప్రసిద్ధం అయిన అర్కాన్సాస్‌లోని క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్కుకి వెళ్లారు. ఇద్దరు క్యాజువల్ మాట్లాడుకుంటు నడుస్తూ ఉండగా నోరిస్ కు ఓ చోట ఏదో మెరుస్తున్న వస్తువు కనిపించింది. దాన్ని నోరిస్ పెద్దగా పట్టించుకోలేదు. ఏదో రాయి అనో లేదా ఏ గాజు ముక్కో అనుకంది. కానీ దగ్గరకు వెళ్లేకొద్దీ మెరుపు బాగా కనిపించటంతో అది ఏంటో చూద్దామని వెళ్లి దాన్ని చేతుల్లోకి తీసుకుని చూసింది.

Read more : అదృష్టం అంటే నీదేనమ్మా : డైమండ్ పార్కుకి వెళితే నిజంగానే డైమండ్ దొరికింది

అది పసుపు పచ్చగా మెరుస్తున్న రాయిలా ఉంది. దాని షేపు చూసి భలే ఉందే అని అనుకుని దాన్ని తీసుకుంది. ఏదో విలువైన రాయి అనుకుంది. పార్కు వజ్రాలకు ప్రసిద్ధం అయిన క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్కు సామాన్య ప్రజల కోసం తెరవబడింది.దాంట్లో చాలామంది వాకింగ్ చేస్తుంటారు. సరదాగా వచ్చిపోతుంటారు. పార్కులోని కొంత భాగంలో ఇప్పటికీ వజ్రాలున్నాయని చాలామంది అంటుంటారు. కానీ ఆ ప్రాంతం ప్రజలకు అందుబాటులో లేదు. పార్కులో కొంతభాగాన్ని మాత్రమే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంచారు.అలా నోరీన్ దంపతులు వాకింగ్ కోసం వెళ్లిన క్రమంలో ఆ వజ్రం దొరికింది. అదేంటో తెలుసుకోవాలనుకున్న నోరీన్ పార్కులోని డైమండ్ డిస్కవరీ సెంటర్ వద్దకు వెళ్లింది.

Read more : పన్నా మైన్స్ లో నిరుపేదకు దొరికిన రూ.40లక్షల విలువైన వజ్రం

అక్కడి సిబ్బంది అది అరుదైన పసుపు రంగు వజ్రం అని గుర్తించారు. నొరీన్ అదృష్టం ఏంటంటే పార్కు నియమాల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతంలో దొరికిన వజ్రాలు ప్రజలకే చెందుతాయి. అలా నొరీన్‌కు దొరికిన వజ్రం ఆమెకే సొంతం అయ్యింది. ఆ వజ్రం 4.38 క్యారెట్ల బరువు ఉంది. ఆ వజ్రం జెల్లీబీన్ ఆకారంలో ఉంది. ఆ వజ్రం విలువ ఎంతో ఇంకా నిర్ధారణ కాలేదు. కానీ దాని క్వాలిటీని బట్టి..ఆ వజ్రం విలువ 15 వేల డాలర్ల భారత కరెన్సీ ప్రకారం రూ. 11 లక్షలు నుంచి 85 వేల డాలర్ల(65 లక్షల రూపాయలు) వరకూ ఉండవచ్చని డైమండ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 1906 నుంచి క్రేటర్ ఆఫ్ డైమండ్స్ స్టేట్ పార్కులో ఇప్పటివరకు 75వేల వజ్రాలు దొరికాయని సమాచారం.