Facebook: ఫేస్‌బుక్‌ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడం ఎలా? ఫేస్ బుక్ టైం పాస్ చేసేందుకు కాదు.. డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. కొంచెం టెక్నికల్ స్కిల్స్ ఉండి.. సోషల్ మీడియా వాడకంపై అవగాహన ఉంటే చాలు..

Facebook: ఫేస్‌బుక్‌ ద్వారా డబ్బులు సంపాదించుకోవచ్చు..!

How To Make Money From On Facebook

How to Make Money From on Facebook : ఆన్‌లైన్‌లో డబ్బులు సంపాదించడం ఎలా? సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ టైం పాస్ చేసేందుకు కాదు.. డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. కొంచెం టెక్నికల్ స్కిల్స్ ఉండి.. సోషల్ మీడియా వాడకంపై అవగాహన ఉంటే చాలు.. ఫేస్ బుక్ మీకు డబ్బులు డాలర్లలో చెల్లిస్తుంది. అనవసరమైన ఆన్ లైన్ సర్వేలతో సమయం, డబ్బు వృథా చేసుకునే బదులు ఫేస్ బుక్ నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవాలో తెలుసుకుంటే సరి.. ఇందుకోసం కొన్ని మనీ ఎర్నింగ్ టూల్స్ వచ్చేశాయి. ప్రతి నెలలో రెండు బిలియన్ల మంది యూక్టివ్ యూజర్లు ఉంటే.. రోజుకు 1.37 బిలియన్ల మంది యూజర్లు యాక్టివ్ గా ఉంటున్నారు. ఇంతకీ ఫేస్ బుక్ నుంచి డబ్బులు ఎలా సంపాదించుకోవచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. మీరు ఏదైనా బిజినెస్ చేస్తుంటే.. ఆయా ప్రొడక్టులను ఫేస్ బుక్ ద్వారా సేల్ చేసుకోవచ్చు. అందులో గృహానికి సంబంధించివి కావొచ్చు. గాడ్జెట్లు, వంట సామాగ్రి, ఫెస్టివల్ సీజన్ ప్రొడక్టులను సేల్ చేసుకోవచ్చు. మార్కెట్ ప్లేస్ ద్వారా ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
APPSC Job Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్, 190 ఉద్యోగాలు భర్తీ

మరో టూల్.. ఫేస్ బుక్ ప్యాన్ పేజ్ (Facebook Fan Page)లో మనీ ఎర్నింగ్‌ సంపాదించడం కొంచెం కష్టమే. మనీ ఎర్నింగ్‌ చేసేందుకు చాలా సమయం పడుతుంది. కనీసం ఆరునెలల నుంచి ఏడాది సమయం పట్టొచ్చు. ఫేస్‌బుక్‌ ఫ్యాన్‌ పేజీ ద్వారా డబ్బులు సంపాదించాలంటే మీకు దానిపై మంచి అవగాహన ఉండాలి. అప్పుడే అందులో మీరు విజయం సాధించగలరు. Entertainment, Health, Business, Gadgets, Technology వంటి రంగాలను ఎంచుకోవచ్చు. మీకు హెల్త్‌ గురించి పూర్తి అవగాహన ఉంటే.. యూజర్లకు ఉపయోగపడే కంటెంట్‌తో పోస్టర్లను డిజైన్ చేసి ఫేస్‌బుక్‌ ఫ్యాన్‌ పేజ్‌లో పోస్టు చేస్తుండాలి. రెగ్యులర్‌గా హెల్త్‌ గురించి ఇన్ఫర్మేషన్‌ షేర్ చేస్తుండటం వల్ల యూజర్లు మీకు కనెక్ట్ అవుతారు. మీ ఫేజీని ఫాలో అవుతారు. అలా ఫేజీ ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవాల్సి ఉంటుంది.

మీ ఫాలోవర్లను బేస్‌ చేసుకొని ప్రాడక్ట్‌లను సేల్‌ చేసుకోవచ్చు. హెల్త్‌ కేర్‌ కంపెనీ ప్రతినిధుల్నిసంప్రదిస్తే పెయిడ్‌ మార్కెటింగ్‌ పొందవచ్చు. ఒక్కో పోస్ట్‌ను బట్టి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. ఫేస్‌బుక్‌ గ్రూప్స్‌.. ఇలా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. మీరు షేర్ చేసే కంటెంట్‌ జెన్యూన్‌గా ఉంటే చాలు.. యూజర్లు ఆటోమాటిక్‌గా ఆ గ్రూప్స్‌ ఫాలో అయిపోతారు. ఫాలోవర్స్‌ పెరిగే కొద్ది మీ ప్లానింగ్ మారుతుండాలి. బిజినెస్‌కు సంబంధించి ఈ- బుక్‌ రెడీ చేసుకోండి. ఆన్ లైన్ ఆఫర్‌ చేయండి.. ఆసక్తి గల యూజర్లు ఈ-బుక్‌ను కొనుగోలు చేస్తారు. ఇలా కూడా మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు. పెయిడ్‌ బిజినెస్‌ కన్సల్టెన్సీ ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.

ఇన్ ఫ్లూయన్సర్ మార్కెటింగ్‌.. మార్కెట్‌లో జాతీయ,అంతర్జాతీయ ప్రాడక్ట్‌లకు సేల్స్‌ జరగాలంటే.. బ్రాండ్‌ అవర్ నెస్ ఉండితీరాలి. అప్పుడే మీ ప్రొడక్ట్ సులభంగా సేల్ అవుతుంది. అది ఇన్‌ ఫ్లూయన్సర్ల చేతిలో ఉంటుంది. ప్రాడక్ట్ క్యాంపెయిన్ కోసం కోట్లు కుమ్మరించే బదులు లోకల్‌ ఇన్‌ ఫ్లూయన్సర్లను ఆశ్రయిస్తే తక్కువ ఖర్చు అవుతుంది. ఎక్కువగా క్యాంపెయిన్ అవుతుంది. బిజినెస్‌ కూడా పెరుగుతుంది. మార్కెట్‌లో ఇన్‌ ఫ్లూయన్సర్‌ మార్కెటింగ్‌కు మంచి డిమాండ్‌ ఉంది. ఇంకెందుకు ఆలస్యం.. ఈ సోషల్ మీడియా టూల్స్ ద్వారా మీరూ కూడా మీకు నచ్చిన టూల్ ఎంచుకుని డబ్బులు సంపాదించుకోవచ్చు.
Navratri Offer : పేటీఎం నుంచి ‘గోల్డ్’ ఆఫర్