Navratri Offer : పేటీఎం నుంచి ‘గోల్డ్’ ఆఫర్
పేటీఎం కూడా ఫెస్టివల్ ఆఫర్ ను ప్రకటించింది. దసరా నవరాత్రుల సందర్భంగా...బంగారం గెలుపొందే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

Paytm
Paytm Navratri Offer : పండుగ సీజన్ వచ్చిందంటే చాలు..ప్రజలను ఆకర్షించేందుకు పలు ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయి పలు కంపెనీలు. భారీ ఆఫర్లు, ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అంటూ…ప్రకటనలు గుప్పిస్తుంటాయి. ప్రధానంగా..దసరా, దీపావళి పండుగలను టార్గెట్ చేస్తుంటాయి. ప్రజలు కూడా ఆఫర్లు, డిస్కౌంట్లు కోసం వేచి చూస్తుంటారు. పేటీఎం కూడా ఫెస్టివల్ ఆఫర్ ను ప్రకటించింది. దసరా నవరాత్రుల సందర్భంగా…బంగారం గెలుపొందే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది.
ఇండేన్, హెచ్ పీ, భారత్ గ్యాస్ ఎల్పీజీ సిలిండర్లను బుక్ చేసుకోవడం ద్వారా..రూ. 10 వేల 001 బంగారాన్ని గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. నవరాత్రి గోల్డ్ ఆఫర్ అక్టోబర్ 07వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ఫెస్టివల్ ఆఫర్ పొందాలంటే…గ్యాస్ బుకింగ్ సమయంలో…పేటీఎం వాలెట్, పేటీఎం యూపీఐ, కార్డ్స్, నెట్ బ్యాకింగ్ లేదా, పేటీఎం పోస్టు పెయిడ్ విధానాల్లో ఒకదానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ వరకు సిలిండర్ స్టేటస్ ను ఎప్పటికప్పుడు తెలుసుకొనే ఫీచర్ ను పేటీఎం అందిస్తోంది.
Read More : Height : ఎలాంటి ఆహారం తింటే ఎత్తు పెరుగుతారో తెలుసా?..
ఆటోమేటెడ్ ఇంటెలిజెంట్ రిమైండర్స్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫెస్టివల్ సీజన్ లో భాగంగా..ప్రతి రోజు ఐదుగురిని ఎంపిక చేసి రూ. 10,001 విలువైన బంగారం అందిస్తామని వెల్లడించింది. పేటీఎం డిజిటల్ గోల్డ్ తో పాటుగా…ప్రతీ బుకింగ్ పై యూజర్లు 1000 విలువైన క్యాష్ బ్యాక్ పాయింట్లు పొందే అవకాశం ఉందని పేర్కొంది. ప్రముఖ బాండ్లకు సంబంధించిన గిఫ్ట్ వోచర్ల కూడా రిలీస్ చేసుకొనే అవకాశం కల్పించింది.