Telugu Richest Persons : ఐఐఎఫ్ఎల్ రిచ్ లిస్ట్ – తెలుగు రాష్ట్రాల్లో రూ.1000 కోట్లపైగా సంపద ఉన్న కుబేరులు వీరే

ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 69 మంది కుబేరులు చోటు దక్కించుకున్నారు.

Telugu Richest Persons : ఐఐఎఫ్ఎల్ రిచ్ లిస్ట్ – తెలుగు రాష్ట్రాల్లో రూ.1000 కోట్లపైగా సంపద ఉన్న కుబేరులు వీరే

Telugu Richest Persons

Telugu Richest Persons : ఐఐఎఫ్ఎల్ వెల్త్ హూరున్ ఇండియా రిచ్ లిస్ట్ లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 69 మంది కుబేరులు చోటు దక్కించుకున్నారు. దేశ వ్యాప్తంగా రూ. 1,000 కోట్లకంటే పైన సంపద కలిగిన వారి జాబితాను విడుదల చేయగా ఈ జాబితాలో 69 మంది తెలుగువారు ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి చోటు దక్కించుకున్నవారి మొత్తం సంపద రూ.3,79,200 కోట్లుగా ఉంది. సంపన్నుల్లో అధికంగా ఫార్మాకు చెందిన వారే ఉండటం విశేషం.. పార్మా అధినేతల తర్వాత బిల్డర్లు ఈ జాబితాలో స్థానం దక్కించుక్కారు. ఇక ఈ లిస్టులో మొదటి స్థానంలో దివిస్ లేబొరేటరీ అధినేత మురళీ దివి అగ్ర స్థానంలో నిలిచారు. ఆయన కుటుంబానికి చెందిన ఆస్తుల విలువ రూ.79,000 కోట్లు ఉంది.

Read More :  హెటిరో ఫార్మా కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ఆ తర్వాతి స్థానంలో హెటెరో డ్రగ్స్ అధినేత పార్థసారథి రెడ్డి నిలిచారు. ఆయన కుటుంబ ఆస్తులు రూ.26, 100 కోట్లగా ఉన్నట్లు ఐఐఎఫ్ఎల్ పేర్కొంది. మేఘా ఇంజినీరింగ్ అధినేతలు పీ పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డిలు రూ.23,400 కోట్లతో మూడో స్థానంలో, రూ.12,300 కోట్లతో డాక్టర్ రెడ్డీస్ అధినేత కె సతీష్ రెడ్డి 4వ స్థానంలో, రూ.12,000 కోట్లతో GARకు చెందిన అమరేందర్ రెడ్డి 5వ స్థానంలో, ఎంఎస్ఎన్ ల్యాబ్స్ అధినేత సత్యనారాయణ రెడ్డి రూ.11,500 కోట్లతో ఆరవ స్థానంలో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అధినేత జీవీ ప్రసాద్ రూ.10,300 కోట్లతో ఎనిమిదో స్థానంలో, రూ.9700 కోట్లతో సువెన్ ఫార్మా అధినేత వెంకటేశ్వర్లు జాస్తి 8వ స్థానంలో, గ్లాండ్ ఫార్మా అధినేత పీవీఎన్ రాజు రూ.9300 కోట్లతో తొమ్మిదో స్థానంలో, నాట్కో ఫార్మా అధినేత వీసీ నన్నపనేని రూ.9100 కోట్లతో 10వ స్థానంలో నిలిచారు.

Read more :  అనంతపురంలో 2దశాబ్ధాల తర్వాత బంగారు గ‌నుల తవ్వకానికి అనుమతులు

ఇక కుబేర మహిళగా బయోలాజికల్ ఈ-లిమిటెడ్ ప్రమోటర్, మేనేజింగ్ డైరెక్టర్ మహిమా దాట్ల నిలిచారు. ఆమె కుటుంబ ఆస్తుల విలువ రూ.7,700 కోట్లుగా ఉంది. మరో మహిళా కుబేరురాలు NACL ఇండస్ట్రీస్‌కు చెందిన లక్ష్మీరాజు సంపద రూ.1000 కోట్లు.