APPSC Job Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 190 ఉద్యోగాలు భర్తీ

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీపీఎస్సీ. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE) ఉద్యోగాలు భర్తీ

APPSC Job Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 190 ఉద్యోగాలు భర్తీ

Appsc Job Notification

APPSC Job Notification : ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీపీఎస్సీ. పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్‌ ఇంజినీర్‌(AE) ఉద్యోగాలు భర్తీ చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఈ మేరకు 190 ఉద్యోగాల భర్తీకి గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Brinjal : వంకాయ క్యాన్సర్ ని అడ్డుకుంటుందా?

అభ్యర్థులు ఈ నెల 21 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 11వ తేదీ దరఖాస్తులకు ఆఖరి తేదీ. పూర్తి వివరాలు http://psc.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. పంచాయతీ రాజ్, దేవాదాయ, వాటర్ రిసోర్స్ శాఖల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

ఇటీవలే రాష్ట్రంలో శాంతి భద్రతల అంశంపై జగన్ పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది కొత్తగా 6 వేల పోలీసు పోస్టులు భర్తీ చేసేలా దృష్టి సారించి సన్నద్ధం కావాలన్నారు. జగన్ ప్రకటనతో వచ్చే ఏడాది పోస్టుల భర్తీ చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

Height : ఎలాంటి ఆహారం తింటే ఎత్తు పెరుగుతారో తెలుసా?..

మరోవైపు త్వరలోనే 670 జూనియర్‌ అసిస్టెంట్స్‌, మరో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ సెక్రటరీ పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు ఇటీవలే తెలిపారు. ఒక్కొక్కటిగా వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. అన్నట్టుగానే ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.

* వేర్వేరు ఇంజినీరింగ్ సబ్ సర్వీసెస్ లో ఏఈ పోస్టులు భర్తీ
* ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
* 35 క్యారీ ఫార్వాడ్ పోస్టులు, 155 కొత్త ఖాళీలు
* పే స్కేల్.. రూ.31,460 – రూ. 84,970
* వయసు .. 18 – 42 ఏళ్లు ఉండాలి
* సంబంధిత ఇంజీరింగ్ విభాగాల్లో డిగ్రీ, డిప్లొమా చేసిన వారు అర్హులు
* LCE లేదా LME లేదా LAE లేదా LSE లేదా DCE డిప్లొమా చేసిన వాళ్లు అర్హులు
* రాత పరీక్ష ఆధారంగా ఎంపిక, త్వరలో ఎగ్జామ్ షెడ్యూల్
* అప్లికేషన్ ఫీజు రూ.250, ఎగ్జామ్ ఫీజు రూ.80