Height : ఎలాంటి ఆహారం తింటే ఎత్తు పెరుగుతారో తెలుసా?..

ఎముకల ఆరోగ్యం కోసం ఆహారంలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్‌- డి సరైన మోతాదుల్లో తీసుకోవాలి. ప్రొటీన్ల కోసం గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, బాదం, ఆక్రోట్‌, పిస్తా ల

Height : ఎలాంటి ఆహారం తింటే ఎత్తు పెరుగుతారో తెలుసా?..

Hight

Height : జన్యుపరమైన కారణాల వల్ల చాలా మంది పిల్లలు ఎత్తు తక్కువగా ఉంటారు. సాధారణంగా పిల్లలు 20 ఏళ్ల వయస్సు వచ్చేవరకు ఎత్తు పెరిగే అవకాశం ఉంటుంది. ఎత్తు పెరగటమనేది వంశపారంపర్య లక్షణమే అయినా తీసుకునే ఆహారం కూడా ఎదుగుతున్న పిల్లల్లో పెరుగుదలకు దోహదం చేస్తుందని చెప్పవచ్చు. తల్లిదండ్రులు తమ ఎదిగే పిల్లల విషయంలో వారు తీసుకునే ఆహారం, నిద్ర విషయంలో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎత్తుపెరగడమనేది ముఖ్యంగా ఎముకల ఆరోగ్యం పైనే అధారపడి ఉంటుంది.

ఎముకల ఆరోగ్యం కోసం ఆహారంలో ప్రొటీన్లు, కాల్షియం, విటమిన్‌- డి సరైన మోతాదుల్లో తీసుకోవాలి. ప్రొటీన్ల కోసం గుడ్లు, మాంసం, చేపలు, పాలు, పెరుగు, పప్పుధాన్యాలు, బాదం, ఆక్రోట్‌, పిస్తా లాంటి గింజలు తీసుకోవచ్చు. ఆకుకూరలు, పాలు, పెరుగు, పనీర్‌ మొదలైన ఆహారపదార్థాల్లో కాల్షియం ఉంటుంది. రోజుకు కనీసం అరలీటరు నుండి ముప్పావు లీటర్‌ పాలు లేదా పాల పదార్థాలు తీసుకుంటే సరిపడా కాల్షియం లభిస్తుంది.

ఎత్తు సహజంగా పెరగాలంటే, మినరల్స్ అధికంగా వున్న పచ్చటి బీన్స్, బ్రక్కోలి, గోంగూర, కేబేజి, సొరకాయ, కేరట్, గింజ ధాన్యాలు, అరటిపండ్లు, ద్రాక్ష, మొదలైనవి తినాలి. విటమిన్‌- డి కోసం అరగంట సమయం ఎండలో తిరిగితే సరిపోతుంది. రోజూ కనీసం రెండు వేల కెలరీల శక్తినిచ్చే ఆహారం తీసుకుంటే మీరు ఎత్తు మాత్రమే కాక తగినంత బరువు పెరిగేందుకూ అవకాశం ఉంటుంది.

ఆహార జాగ్రత్తలతో పాటు వ్యాయాయం కూడా చేయాలి. రోజుకు ముప్పై నుండి అరవైనిమిషాల పాటు వేగంగా నడవడం, పరిగెత్తడం, ఏదైనా ఆటలు ఆడడం లాంటివి చేయండి. స్రెచ్చింగ్ ఎక్సర్ సైజ్ ల వల్ల శరీరాం ఫిట్ గా ఉంటుంది. వ్యాయామాల వల్ల గ్రోత్ హార్మోన్ల పనితీరు మెరుగవుతుంది.