Brinjal : వంకాయ క్యాన్సర్ ని అడ్డుకుంటుందా?…

ఎముకలు ధృడంగా మారడానికి ఎముకల సాంద్రతను పెంచడానికి అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. వంకాయలో వుండే ఫైటో న్యూట్రియంట్స్, పొటాషియంలు మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంపొందించడం

Brinjal : వంకాయ క్యాన్సర్ ని అడ్డుకుంటుందా?…

Brinjal (1)

Brinjal : ఆరోగ్య కరమైన కూరగాయాల్లో వంకాయ కూడా ఒకటి. వంకాయలను వేపుడుగా, గుత్తి వంకాయ కూరగా, పులుసు కూరగా చేసేకుని ఇష్టంగా తింటారు. వంకాయలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అంతేకాదు వివిధ రకాల సమస్యలను తగ్గించటంలో సైతం వంకాయ బాగా దోహదం చేస్తుంది.

వంకాయల్లో వుండే యాంటీ ఆక్సిడెంట్స్, ఆంథో సయనిన్స్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. వంకాయలో వుండే సోలోసోడైన, రామ్మోసైల్, గ్లైకోసైడ్స్ అనబడే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. వంకాయలోని ఫైబర్ శరీరంలోని విషాన్ని, రసాయనాలను గ్రహించి పెద్ద పేగు క్యాన్సర్ నుంచి రక్షిస్తుంది. కాబట్టి చాలా వరకు క్యాన్సర్ ను నివారించుకోవచ్చు. వీటిలో వుండే ఐరన్, కాల్షియంలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

వంకాయను క్రమం తప్పకుండా తీసుకొంటే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అంతేకాకుండా మీ రక్తపోటు సాధారణ స్థాయిలో నిర్వహించడానికి సహాయపడుతుంది.సాధారణ కొలెస్ట్రాల్ స్థాయి మరియు రక్తపోటు గుండె వ్యాధులను తగ్గించటానికి దోహదం చేస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు వంకాయని తినడం వల్ల రాత్రి హాయిగా నిద్రపోతారు.

ఎముకలు ధృడంగా మారడానికి ఎముకల సాంద్రతను పెంచడానికి అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడతాయి. వంకాయలో వుండే ఫైటో న్యూట్రియంట్స్, పొటాషియంలు మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంపొందించడం వల్ల ఫ్రీరాడికల్స్ నాశనం అవుతాయి. దీనివల్ల మెదడుకు రక్త సరఫరా బాగా జరిగి, మెదడు యాక్టివ్ గా పనిచేస్తుంది.

వంకాయలలో సాపోనిన్ అనబడే సమ్మేళనం ఉండడంవల్ల శరీరంలో కొవ్వు నిల్వలను తగ్గిస్తుంది. ఫలితంగా బరువు పెరిగే అవకాశం కూడా తక్కువ. వంకాయలను తినడం వల్ల వీటిలో వుండే ఐరన్, థయామిన్, నియాసిన్, కాపర్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ బి6, విటమిన్ కె, పుష్కలంగా లభిస్తాయి.

అంటువ్యాధులను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వంకాయ యొక్క ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి. వంకాయలో అంటువ్యాధుల మీద పోరాటం కొరకు సహాయపడే విటమిన్ సి అధిక మొత్తం కలిగి ఉంటుంది. జుట్టు బలోపేతం కావడానికి వంకాయ సహకరిస్తుంది. జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.

వంకాయలో ఖనిజాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. వంకాయలో ఉండే విటమిన్లు మరియు పీచు అనేవి డెటాక్సిఫికేషన్ మరియు మీ చర్మం ప్రకాశించటానికి సహాయపడతాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం వంకాయను పిండి కట్టుల్లో వాడతారు. అయితే వంకాయ తినటం వల్ల కొంతమంది చర్మసంబంధమైన అలర్జీలు వస్తుంటాయి. అలాంటి వారు వంకాయను తినకపోవటమే మంచిది. వారానికి ఒకసారైన వంకాయను తింటే మంచిది.