ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. కర్నూలు వైసీపీలో టికెట్ ముసలం, బయటపడ్డ వర్గ విభేదాలు

కొండారెడ్డి బురుజుపై మూడోసారి వైసీపీ జెండా ఎగరాలంటే.. ఎస్వీ కుటుంబానికి సీటు కేటాయించాలని ఆయన అనురులు డిమాండ్ చేశారు.

MLA Hafeez Khan Vs Ex MLA SV Mohan Reddy

Kurnool YCP : కర్నూలు వైసీపీలో టికెట్ ముసలం రేగింది. పార్టీ హైకమాండ్ టికెట్ ప్రకటించకముందే వైసీపీలో వర్గ విభేదాలు బయటపడుతున్నాయి. ఎస్వీ కుటుంబానికే కర్నూలు టికెట్ ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ వ్యతిరేక వర్గం సమావేశమైంది. మాజీ ఎమ్మెల్యే మోహన్ రెడ్డి అనుచరులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుంది అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.

కొండారెడ్డి బురుజుపై మూడోసారి వైసీపీ జెండా ఎగరాలంటే.. ఎస్వీ కుటుంబానికి సీటు కేటాయించాలని ఆయన అనురులు డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మధ్య అనేకరోజులుగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎస్వీ మోహన్ రెడ్డికే సర్వేలు అనుకూలంగా ఉన్నాయని ఆయన అనుచరులు అంటున్నారు. ఐదేళ్లు బరాయించాం, ఇక బరాయించం అని తేల్చి చెప్పారు.

Also Read : వైఎస్‌ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?

కర్నూలు అసెంబ్లీ టికెట్ విషయంలో వైసీపీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మధ్య అనేక సంవత్సరాలుగా వర్గపోరు నడుస్తోంది. ఎన్నికల వేళ ఎస్వీ మోహన్ రెడ్డి ప్రధాన అనుచరులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గత ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ విజయానికి ఎస్వీ మోహన్ రెడ్డి కృషి చేశారని, ఈ ఎన్నికల్లో కర్నూలు టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డి కుటుంబానికే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఎస్వీ అనుచరులు. ఈ ఐదేళ్లు తాము తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని, ఇక భరించేది లేదంటున్నారు.

ఎస్వీ మోహన్ రెడ్డికి లేదా ఎస్వీ విజయమ్మకు టికెట్ ఇవ్వాలని కేడర్ డిమాండ్ చేస్తోంది. మూడోసారి కొండారెడ్డి బురుజుపై వైసీపీ టికెట్ ఎగరాలంటే.. కచ్చితంగా ఎస్వీ కుటుంబానికే టికెట్ ఇవ్వాలని అంటున్నారు అనుచరులు. కర్నూలు నగరంలో మైనార్టీల శాతం ఎక్కువ. దాంతో మైనార్టీ వర్గానికి చెందిన అభ్యర్థికే టికెట్ ఇస్తారేమో అనే సందర్భంలో మైనార్టీలే ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వారితో పాటు ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులు కూడా పెద్ద ఎత్తున సమావేశం అయ్యారు. అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందో అన్న సమాచారం అందక ముందే.. టికెట్ లొల్లి షురూ అయ్యింది.

Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?

చాలా ఏళ్లుగా ఎస్వీ మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కార్పొరేటర్ల విషయంలో ఇద్దరి మధ్య తగాదాలు జరిగాయి. వైసీపీ అధిష్టానం అనేక సందర్భాల్లో వీరిద్దరికి సర్ది చెప్పినా.. ఇప్పటికి కూడా ఆ సమస్య సద్దుమణగలేదు.

 

ట్రెండింగ్ వార్తలు