Nandamuri Balakrishna: ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ.. మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవరూ అడగలేదని బాలకృష్ణ అన్నారు. జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగిందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ సభ దృష్టికి తెచ్చారు.
ఆరోజు సినీ ప్రముఖులను కలిసేందుకు జగన్ ఇష్టపకడపోతే.. చిరంజీవి గట్టిగా అడిగాకే.. సినీ ప్రముఖులను జగన్ కలిశారని కామినేని తెలిపారు. అయితే కామినేని మాటలకు బాలకృష్ణ అభ్యంతరం తెలిపారు. ఆరోజు గట్టిగా అడిగిన వారు ఎవరూ లేరని అన్నారు. జగన్ ను కలిసేందుకు తనకూ ఆహ్వానం వచ్చినా వెళ్లలేదని చెప్పారు. చిరంజీవిని అవమానించారు అనడం వరకు వాస్తవమేనని బాలకృష్ణ చెప్పారు.
”జగన్ హయాంలో సినీ ప్రముఖులకు అవమానం జరిగితే గట్టిగా ఎవరూ అడగలేదు. ఆరోజు గట్టిగా అడిగిన వారెవ్వరూ లేరని సభకు స్పష్టం చేస్తున్నా. ఆ సైకోని కలిసేందుకు నాకూ ఆహ్వానం వచ్చినా వెళ్లలేదు. చిరంజీవిని అవమానించారు అనడం వరకు వాస్తవమే. కూటమి ప్రభుత్వంలోనూ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ నాది 9వ పేరుగా ముద్రించింది. ఎవడాడు ఇలా రాసిందని ఆరోజే అభ్యంతరం వ్యక్తం చేశాను. నాడు జగన్ హయాంలో సినీ ప్రముఖులకు జరిగిన అవమానంపై అసెంబ్లీకి స్పష్టత ఇవ్వాలనే నేను స్పందించాను. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి” అని సభను కోరారు బాలకృష్ణ.
Also Read: వైసీపీ నేతల రప్పారప్పా డైలాగులపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు కీలక కామెంట్స్.. జగన్‌కు సూటి ప్రశ్న..
”సినిమా వాళ్లు డిస్కస్ చేయాలంటే.. వాళ్లే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ లేరు. వారిని కలవడం జగన్ కు ఇష్టం లేదు. రాజకీయాలతో సంబంధం లేకుండా వేరుగా ఉంటున్న ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళిని రమ్మన్నారు. చిరంజీవి వారందరిని రమ్మన్నారు. వాళ్లు రాము అన్నారు. రాము అంటే కూడా బతిమాలారు. మోహమాటంతో వస్తే.. ఫస్ట్ షాక్.. గేట్ దగ్గర కార్ ఆపేశారు. అందరినీ కారు దిగి రమ్మన్నారు. లోపల రెండో షాక్.. ఇంత పెద్ద వాళ్లను పిలిచి పోసాని కృష్ణమురళి ముందు కూర్చోబెట్టారు. మూడో షాక్.. సీఎం మిమ్మల్ని కలవడం లేదు. సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెబుతారు అని అన్నారు.
అప్పుడు చిరంజీవి కొంచెం గట్టిగా అడిగారు. మీరు చెబితేనే వీరందరిని పిలుచుకొచ్చాను. ఆయన రాను అనడం ఏంటి అని గట్టిగా అడిగారు. అప్పుడు జగన్ వచ్చారు. మీరు తండ్రి లాంటి వారు, సినీ పరిశ్రమను జాగ్రత్తగా చూసుకోండి అని కోరారు. అది బయటకు రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారు. ఇంతకన్నా శాడిస్ట్ మెంటాలిటీకి ఏం ఎగ్జాంపుల్ ఉంటుంది” అంటూ నాడు జగన్ హయాంలో సినీ ప్రముఖులకు జరిగిన అవమానంపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో వివరించారు.