MLA Roja : శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్‌గా చక్రపాణిరెడ్డిని నియమించడంతో ఎమ్మెల్యే రోజా అలక

ఆలయ ఛైర్మన్‌ పదవిని చక్రపాణిరెడ్డికి ఇవ్వొద్దని రోజా గతంలోనే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే చక్రపాణిరెడ్డికే ఆలయ ఛైర్మన్‌ పదవిని కేటాయించడంతో రోజా మనస్తాపానికి గురయ్యారు.

Roja

MLA Roja pout : తన వైరి వర్గానికి కీలక పదవులు రావడంతో నగరి ఎమ్మెల్యే రోజా అలకబూనారు. శ్రీశైలం ఆలయ పాలకమండలిని ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్‌గా రెడ్డివారి చక్రపాణిరెడ్డి నియమించింది. చక్రపాణిరెడ్డి ఛైర్మన్‌గా 15 మంది సభ్యులతో పాలకమండలి ఖరారు చేసింది.

అయితే కీలకమైన ఛైర్మన్‌ పదవిని రెడ్డివారి చక్రపాణిరెడ్డికి ఇవ్వడంతో రోజా మనస్తాపానికి గురయ్యారు. చక్రపాణిరెడ్డితో కొంతకాలంగా రోజాకు విభేదాలు కొనసాగుతున్నాయి. గతంలో ఈ విషయాన్ని రోజా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లింది.

Bandi Srinivas : ఏ పద్ధతిన ప్రభుత్వం పీఆర్సీ ఫిక్స్ చేసింది..?

ఆలయ ఛైర్మన్‌ పదవిని చక్రపాణిరెడ్డికి ఇవ్వొద్దని రోజా గతంలోనే అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. అయితే చక్రపాణిరెడ్డికే ఆలయ ఛైర్మన్‌ పదవిని కేటాయించడంతో రోజా మనస్తాపానికి గురయ్యారు. తన మాట లెక్క చేయకుండా చక్రపాణి రెడ్డికి పదవి ఇవ్వడంతో ఆమె అలకబూనారు.