TJR Sudhakar Babu (Photo : Google)
TJR Sudhakar Babu : సీఎం జగన్ పై రాజకీయ కుట్ర జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు ఆరోపించారు. సీఎం జగన్ ను అవమానపరచాలని కుటిల రాజకీయాలు చేస్తున్నారని ఆయన అన్నారు. జగన్‌పై మచ్చ వెయ్యడానికి వివేకా కేసును అవినాశ్ రెడ్డి దగ్గరకి తీసుకొచ్చారని అన్నారు. నా తమ్ముడు మంచి వాడు. హత్య చెయ్యలేదని చెప్పుకోవడం తప్పా..? అని ప్రశ్నించారు. అవినాశ్ తప్పు చెయ్యడని మేమంతా నమ్ముతున్నాం అన్నారు. మా అనుమానాలపై ఎందుకు సీబీఐ విచారణ జరగడం లేదని ఆయన నిలదీశారు. హత్య జరిగినప్పుడు టీడీపీ ప్రభుత్వం మూడు నెలల్లో ఏం చేయగలిగింది? అని అడిగారు.
”ఆనాడే అవినాశ్, భాస్కర్ రెడ్డిల పేర్లు ఎందుకు రాలేదు..? ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి.. వివేకా హత్యకు కారకులని మేము చెప్తుంటే సీబీఐ ఎందుకు విచారణ చెయ్యడం లేదు..? NTR మరణానికి కారకులు ఎవరో చంద్రబాబు ఎందుకు విచారణ కోరలేదు..?
NTR కు చంద్రబాబు వెన్నుపోటు ఎలా పొడిచాడో కేస్ స్టడీ చెయ్యాలి. చంద్రబాబు క్రిమినల్ చర్యలపై కేస్ స్టడీ చెయ్యాలి. NTR, YSR కుటుంబాలను చంద్రబాబు నిలువునా చీల్చిన విధానాన్ని కేస్ స్టడీ చెయ్యాలి. లోకేశ్ చదువులకు ఫీజులు ఎవరు కట్టారు? ఆయన రాజకీయ ప్రస్థానంపై కేస్ స్టడీ చెయ్యాలి.
Also Read..AP CM Jagan : సెప్టెంబర్ నుండి విశాఖ నుంచే పాలన.. నేను కూడా అక్కడే ఉంటా : సీఎం జగన్
చంద్రబాబుకి దమ్ము ధైర్యం ఉంటే కుప్పంలో గెలవాలి. కనీసం 175 స్థానాలకు చంద్రబాబు దగ్గర అభ్యర్థులు ఉన్నారా..? విశాఖలో దాడి, వివేకా కేసుల్లో చంద్రబాబులా దిగజారుడు రాజకీయాలు జగన్ చెయ్యరు. బాధితులను ముద్దాయిలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. వివేకా కుటుంబంలో ఆస్తి, వ్యక్తిగత గొడవలున్నాయి. ఆ దిశగా ఎందుకు విచారణ జరగడం లేదు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల సాధనకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ వెళ్ళడం అనేది సీఎంగా ఆయన కర్తవ్యం” అని ఎమ్మెల్యే సుధాకర్ బాబు అన్నారు.