YS viveka case : సీఎం జగన్, అవినాశ్ రెడ్డిల నుంచి నాకు ప్రాణహాని ఉంది : కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు

వివేకా హత్యలో పాలుపంచుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నానని ఈ కేసు విషయంలో వాస్తవాలు వెల్లడించినందుకు నన్ను చంపేస్తారేమోనని ఆందోళనగా ఉందని సీఎం జగన్, ఎంపీ అవినాశ్ ల నుంచి నాకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించాలని.. కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు దస్తగిరి.

YS viveka case : సీఎం జగన్, అవినాశ్ రెడ్డిల నుంచి నాకు ప్రాణహాని ఉంది : కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు

YS Viveka case

Updated On : April 19, 2023 / 5:42 PM IST

YS viveka case : సీఎం జగన్, అవినాశ్ రెడ్డిల నుంచి నాకు ప్రాణహాని ఉంది అంటూ వివేకానందరెడ్డి హత్యలో అప్రూవర్ గా మారిన దస్తగిరి కడప ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఎంపీ అవినాశ్ రెడ్డి పదే పదే నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఇప్పటికే వివేకా హత్యలో పాలుపంచుకున్నందుకు పశ్చాత్తాపడుతున్నానని ఈ కేసు విషయంలో వాస్తవాలు వెల్లడించినందుకు నన్ను చంపేస్తారేమోనని ఆందోళనగా ఉందని సీఎం జగన్, ఎంపీ అవినాశ్ ల నుంచి నాకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించాలని.. అవినాశ్ రెడ్డి మనుషులు తనను అనుసరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తు కడప ఎస్పీని కోరారు దస్తగిరి.

వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి అప్రూవర్‌గా మారిన విషయం తెలిసిందే. వివేకా హత్య ఎందుకు చేశారో? ఎలా చేశారో వంటి పెను సంచలన విషయాలు బయటపెట్టిన దస్తగిరి ప్రస్తుతం పులివెందులలో ఉంటున్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారటంపై అభ్యంతరం వ్యక్తంచేస్తు అతని చెప్పిన వివరాలను పరిగణలోకి తీసుకుని తమను విచారణకు పిలవటం..తన తండ్రిని అరెస్ట్ చేయటం వంటివాటిపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారు. ఈ కేసును త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దూకుడు పెంచింది. దీంట్లో భాగంగానే అనూహ్యంగా అవినాశ్ తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

YS viveka case : అవినాశ్, భాస్కర్, ఉదయ్ రెడ్డి ముగ్గురిని కలిపి విచారించనున్న సీబీఐ.. ఆరు రోజులు ఏకధాటిగా సీబీఐ ప్రశ్నల వర్షం

ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఫిబ్రవరి 25 వరకు అరెస్ట్ చేయొద్దని చెబుతునే 24 వరకు ప్రతిరోజు అవినాష్ విచారణకు హాజరుకావాలన్న స్పష్టంచేసింది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు సుదీర్ఘంగా కొనసాగిన క్రమంలో ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. వివేకాను హత్య చేసి సాక్ష్యాధారాలను తారుమారు చేయటంతో అవినాశ్ రెడ్డి అతని తండ్రి భాస్కర్ రెడ్డి కీలకంగా ఉన్నారని దానికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కాబట్టి అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని సీబీఐ కోర్టుకు విన్నవించింది. కానీ కోర్టు మాత్రం 25 వరకు అరెస్ట్ చేయొద్దని చెబుతునే 25 వరకు అవినాశ్ సీబీఐ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో అవినాశ్ రెడ్డి ఆశించనంత రిలీఫ్ రాలేదు. ఈక్రమంలో కాగా ఇప్పటి వరకు పలుమార్లు సీబీఐ విచారణను ఎదుర్కొన్న అవినాశ్ రెడ్డి తొలిసారిగా ఐఓ వికాశ్ సింగ్ ఆధ్వర్యంలో జరుగనున్న విచారణకు హాజరయ్యారు.

వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డినుంచి తాను డబ్బులు తీసుకుని అప్రూవర్ గా మారానని నిందలు వేస్తున్నారని అవినాశ్ రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నారని..తాను అమ్ముడుపోయానని నిరూపిస్తే జైలు శిక్షకు సిద్ధమని, నిరూపించకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేసి జైలుకు వెళ్తారా? అంటూ అవినాశ్ రెడ్డి సవాల్ విసిరారు దస్తగిరి. తనకు ప్రాణాహాని ఉందనే విషయాన్ని సీబీఐ ఎస్పీ, రాయలసీమ రేంజ్ డీఐజీకి తెలియజేస్తానని తెలిపారు దస్తగిరి. కాగా దస్తగిరి వివేకా మాజీ డ్రైవర్ అనే విషయం తెలిసిందే. ఈ హత్య కోసం ఎప్పనుంచి ప్లాన్స్ వేశారో..హత్య కోసం ఆయుధాన్ని కదిరి నుంచి కొనుగోలు చేసినట్లు ముందుగా వివేకా పెంపుడు కుక్కను ఎలా చంపారో వివేకాను హత్య చేయటం..ఆ తరువాత జరిగిన అన్ని పరిణామాలను క్షుణ్ణంగా దస్తగిరి సీబీఐ అధికారులకు వెల్లడించారు. అదే విషయాలను మీడియా ముందు కూడా బయటపెట్టాడు.

YS viveka case : అవినాశ్‌రెడ్డికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు, సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్లు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి.. : సీబీఐ