YS viveka case : అవినాశ్‌రెడ్డికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు, సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్లు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి.. : సీబీఐ

వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశామని కోర్టుకు సీబీఐ వెల్లడించింది. విచారణకు సహకరించటంలేదని కాబట్టి అవినాశ్ రెడ్డికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదని సీబీఐ స్పష్టంచేసింది.

YS viveka case : అవినాశ్‌రెడ్డికి బెయిల్ ఇవ్వటానికి వీల్లేదు, సాక్ష్యాధారాలు తారుమారు చేసినట్లు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నాయి.. : సీబీఐ

YS viveka case

Updated On : April 18, 2023 / 2:51 PM IST

YS viveka case : వివేకా హత్యకేసులో నాకు ఎటువంటి సంబంధంలేదని..తనను కుట్రపూరితంగా నిందిడుని చేసి విచారణల పేరుతో ఇబ్బంది పెడుతున్నారంటూ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపణలకు సీబీఐ గట్టి సమాధానమిచ్చింది. వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని తేల్చి చెప్పంది. దీనికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ లను కూడా కలెక్ట్ చేశామని కోర్టుకు సీబీఐ వెల్లడించింది. తెలంగాణ హైకోర్టులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై విచారణకు సంబంధించి వాదనలు కొనసాగుతున్న క్రమంలో కోర్టు అడిగిన ప్రశ్నలకు సీబీఐ సమాధానమిస్తు ఈ హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని పక్కాగా మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని వాటికి సంబంధించి సైంటిఫిక్ ఎవిడెన్స్ లను కూడా కలెక్ట్ చేశామని వెల్లడించింది.

ఈ హత్య కేసుకు సంబంధించి రూ.40కోట్లు డీల్ జరిగిందని లావాదేవీలకు సంబంధించి ఆధారాలను కూడా సేకరించామని సీబీఐ స్పష్టంచేసింది. అంతేకాకుండా హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాధారాలను తారు మారు చేయటంతో అవినాశ్ రెడ్డి కీలక పాత్ర వహించారని మరోసారి స్పష్టంచేసింది సీబీఐ. దీంట్లో భాగంగానే వివేక తలకు అయిన గాయాలకు కుట్లు వేయటం బ్యాండేజ్ లు వేయటం జరిగిందని హత్యను సహజ మరణంగా క్రియేట్ చేయటంలో అవినాశ్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని సీబీఐ అధికారులు పక్కాగా వెల్లడించారు.

ఈ కేసులో మరో నిందితుడుగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రితో ఇదంతా చేయించారని ..హత్య జరిగితే గుండెపోటుగా క్రియేట్ చేసి సాక్ష్యాధారాలను మాయం చేయటంతో కీలకంగా అవినాశ్ రెడ్డి ఉన్నారని తెలిపిన సీబీఐ విచారణకు అవినాశ్ సహకరించటంలేదని..కాబట్టి మరోసారి విచారించాలని ఇటువంటి పరిస్థితుల్లో అతనికి ముందస్తు బెయిల్ ఇవ్వటానికి వీల్లేదని స్పష్టంచేసింది సీబీఐ.