Vallabhaneni Vamsi Vangaveeti Radha : గన్నవరంలో ఏం జరుగుతోంది? వంశీ, వంగవీటి రాధ మధ్య ఏకాంత చర్చలు

వంశీ, వంగవీటి రాధ కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. వంశీ వంగవీటి రాధను కలవడం చర్చకు తెరలేపింది.

Vallabhaneni Vamsi Vangaveeti Radha : కృష్ణా జిల్లా గన్నవరంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది. ఓ ఫంక్షన్ లో ఎమ్మెల్యే వంశీ, టీడీపీ నేత వంగవీటి రాధ కలుసుకున్నారు. కౌగిలించుకుని ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. కాసేపు ఏకాంతంగా చర్చించుకున్నారు. ఆ తర్వాత వంగవీటి రాధ భుజం మీద చెయ్యి వేసి నడుస్తూ దగ్గరుండి రాధను కారెక్కించారు వంశీ.

ysrcp: గ‌న్న‌వరంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య‌ ఆధిపత్య పోరు.. వ‌ల్ల‌భ‌నేని వంశీపై దుట్టా రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్య‌లు

వంగవీటి రాధ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. వైసీపీకి మద్దుతుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం వైసీపీలో వల్లభనేని వంశీ, గన్నవరం నియోజకవర్గంలో ఆ పార్టీ నేతల మధ్య పోరు నడుస్తోంది. వల్లభనేని వంశీపై దుట్టా రామచంద్రరావు ఫైర్ అవుతున్నారు. ఇక మరో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుతోనూ విభేదాలు కనిపిస్తున్నాయి.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఇలాంటి సమయంలో వల్లభనేని వంశీ వంగవీటి రాధను కలవడం చర్చకు తెరలేపింది. అంతేకాదు ఇద్దరూ ఏకాంతంగా చర్చలు జరపడం మరింత పొలిటికల్ హీట్ పెంచింది. ఇద్దరు నేతలు ఏం చర్చించారు అనేది దానిపై ఆసక్తి నెలకొంది. నియోజకవర్గంలో వైసీపీ నేతల నుంచి వంశీకి సహకారం లేకపోవడంతో రాధతో తన పొలిటికల్ ప్రయాణంపై చర్చించారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Janasena Pawan : జనసేనాని దారెటు? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జనసేన పొత్తు?

గన్నవరంలో రోజూ ఒక ఆసక్తికర సన్నివేశం తెరమీదకు వస్తోంది. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వల్లభనేని వంశీ, వంగవీటి రాధ గన్నవరం వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఇద్దరూ కలుసుకున్నారు. చాలాసేపు ఇద్దరూ ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఫంక్షన్ వచ్చిన వారందరూ వీరిద్దరిని ఆసక్తిగా గమనించారు.

ప్రస్తుతం గన్నవరం రాజకీయాలు పూర్తి రసవత్తరంగా మారాయి. వైసీపీలో ఉన్న దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావ్.. ఇద్దరూ కూడా వంశీపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోపణలు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీనిపై వంశీ, రాధ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీని గురించి వారిని అడగ్గా.. తమ మధ్య రాజకీయపరమైన చర్చలేవీ జరగలేదన్నారు. ఇద్దరమూ స్నేహితులం అని, క్యాజువల్ గా మాట్లాడుకున్నామని తెలిపారు.

వీరిద్దరూ అలా అంటున్నప్పటికి కచ్చితంగా గన్నవరం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఇద్దరూ మాట్లాడుకున్నట్టుగా సమాచారం. దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ తనపై చేస్తున్న ఆరోపణల గురించి ఇద్దరూ చర్చించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఇద్దరూ అనేక అంశాల గురించి మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ఒకసారి వంగవీటి రంగా జయంతి వేడుకల్లో వంశీ, రాధ కలిశారు. ఆ సమయంలో వీరిద్దరి కలయిక పై తీవ్ర చర్చ నడిచింది.

కాగా, గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వంశీ ఓ పిచ్చి కుక్క అంటూ దుట్టా రామచంద్రరావు తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. తాను పుట్టింది, పెరిగింది, పోటీ చేసింది ఇక్కడేన‌ని అన్నారు. వంశీలా తాను ఎక్కడి నుంచో ఇక్కడికి రాలేదన్నారు. వంశీకి 16 ఏళ్ల రాజ‌కీయ‌ అనుభవం ఉంటే.. త‌నకు 30 ఏళ్ల అనుభవం ఉందన్నారు. తాను ఎంపీపీగా గెలిచినప్పుడు వంశీ రాజకీయాల్లోనే లేర‌ని ఆయ‌న చెప్పారు. వంశీతో కలిసి తాను పని చేసే ప్రసక్తి లేదని, ఈ విష‌యాన్ని పార్టీ అధిష్ఠానానికి చెప్పేశాన‌ని వెల్లడించారు.

వంశీ తప్ప ఇంకెవరు పోటీ చేసినా త‌మకు స‌మ్మ‌త‌మేన‌ని దుట్టా తేల్చి చెప్పారు. గన్నవరంలో మట్టి మాఫియాను వంశీ ప్రోత్స‌హించార‌ని ఆయ‌న ఆరోపించారు. దీనిపై తాము కలెక్టర్‌కి ఫిర్యాదు చేశానని, చర్యలు తీసుకుంటారో లేదో చూడాలని అన్నారు. మట్టి మాఫియాని అరికట్టాలంటే మట్టి పాలసీ తీసుకురావాలని దుట్టా చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు