Janasena Pawan : జనసేనాని దారెటు? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జనసేన పొత్తు?

ఇప్పటికే జనసేనాని మూడు ఆప్షన్లు ప్రకటించారు. దీనికితోడు మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ టూర్‌కు వచ్చిన సమయంలో బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ ప్రకటించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి.

Janasena Pawan : జనసేనాని దారెటు? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో జనసేన పొత్తు?

Pawan

Janasena Alliance : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దారెటు..? వచ్చే ఎన్నికల్లో జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది..? బీజేపీతో కలిసి ముందుకు వెళ్లనుందా..? లేక బీజేపీ, టీడీపీతో జతకట్టనుందా..? లేదంటే ఒంటరిగానే పోటీ చేయనుందా..? ఇప్పుడు ఏపీ పాలిటిక్స్‌లో ఇదే చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా… ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. దీంతో ఏపీ పాలిటిక్స్‌ హీటెక్కాయి.

ఇప్పటికే జనసేనాని మూడు ఆప్షన్లు ప్రకటించారు. దీనికితోడు మొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ టూర్‌కు వచ్చిన సమయంలో బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ ప్రకటించాలని డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇందుకు బీజేపీకి జనసేన డెడ్‌లైన్‌ కూడా విధించింది. అయినప్పటికి బీజేపీ మాత్రం అవేవి పట్టించుకోకుండా… పొత్తులపై ప్రకటనేమీ చేయలేదు.

Acidity Problem : అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా! అయితే జాగ్రత్త

ఎన్నికల సమయంలోనే హైకమాండ్ సీఎం అభ్యర్థిని ప్రకటిస్తోందని క్లారిటీ ఇచ్చేసింది. దీంతో ఏపీలో బీజేపీ, జనసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. ఈ క్రమంలో జనసేన భవిష్యత్‌ కార్యచరణపై వ్యూహరచనలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే పొత్తుల అంశాన్ని తెరపైకి తెచ్చి ఏపీ పాలిటిక్స్‌లో పవన్‌ హీట్‌ పెంచారు. ఇప్పటి వరకూ ప్రతీసారి తగ్గింది తామేనన్న పవన్.. ఈ సారి మాత్రం మిగిలిన వాళ్లు తగ్గాలంటూ టీడీపీకి డైరెక్ట్‌గా హింట్ ఇచ్చారు.