Janasena : పొత్తులపై జనసేన కేంద్ర కార్యాలయం కీలక ప్రకటన

పొత్తులపై జనసేన నేతలు చేస్తోన్న కామెంట్లపై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పందించింది. జనసేన-బీజేపీ పొత్తుపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరంలేదని క్లారిటీ ఇచ్చింది.

Janasena : పొత్తులపై జనసేన కేంద్ర కార్యాలయం కీలక ప్రకటన

Janasena

Janasena statement : ఏపీలో జనసేన, బీజేపీ పొత్తులపై ఇరు పార్టీల నేతలు కామెంట్స్ చేస్తున్నారు. జనసేన, బీజేపీ నేతలు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా జనసేన ఇన్‌ఛార్జ్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తమకు పొత్తు లేదన్నారు. బీజేపీతో పొత్తు లేదన్న జనసేన నేత బొలిశెట్టి వ్యాఖ్యలపై సోమువీర్రాజు స్పందించారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. బొలిశెట్టి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.

పొత్తులపై జనసేన నేతలు చేస్తోన్న కామెంట్లపై జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం స్పందించింది. జనసేన-బీజేపీ పొత్తుపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరంలేదని క్లారిటీ ఇచ్చింది. పొత్తులపై జిల్లా నేతలు చేసే ప్రకటనలు వారి వ్యక్తిగతంగానే పరిగణించాలని జనసేన పార్టీ కేంద్రం కార్యాలయం తెలిపింది.

Pawan Kalyan : జనంలోకి జనసేనాని..ఏపీలో అక్టోబర్ 5 నుంచి పవన్ పర్యటన

ఉభయగోదావరి జిల్లాల జనసేన ఇన్‌ఛార్జ్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో తమకు పొత్తు లేదన్నారు. బీజేపీతో పొత్తువల్ల తాము మైనారిటీ, ఎస్సీ-ఎస్టీలకు దూరమవుతున్నామన్నారు. బీజేపీ చేస్తున్న పనులకు జనసేన మూల్యం చెల్లించుకుంటోందన్నారు. పవన్‌ను తిడితే కనీసం స్పందించని బీజేపీతో తమకు పొత్తేంటి అన్నారు.

బీజేపీతో పొత్తు లేదన్న జనసేన నేత బొలిశెట్టి వ్యాఖ్యలపై సోమువీర్రాజు స్పందించారు. జనసేనతో బీజేపీ పొత్తు కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు. బొలిశెట్టి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. నాదెండ్ల మనోహర్‌తో టచ్‌లో ఉన్నామని సోమువీర్రాజు పేర్కొన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కలిసి ముందుకెళ్తామని స్పష్టం చేశారు.