MLC Anantha Babu : వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెండ్

తన మాజీ ఢ్రైవర్ హత్య కేసులో అరెస్టైన కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది.

Mlc Anantha Babu

MLC Anantha Babu :  తన మాజీ ఢ్రైవర్ హత్య కేసులో అరెస్టైన కాకినాడకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. డ్రైవర్ హత్య కేసులో అరెస్టైన అనంతబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.  తన కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ పై పెద్ద ఎత్తున విమర్శలు రావటంతో పార్టీ అతడిని సస్పెండ్ చేసింది.

హత్య కేసులో అరెస్టైన అనంతబాబుకి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి కూడా తప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తన్నారు. పార్టీ ఆ దిశగా కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దావోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అనంతబాబు ఎమ్మెల్సీ పదవి గురించి పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Ysr Congress Party