Mohan Babu hot comments on police
తిరుమల తిరుపతి లడ్డూకి వాడిన నెయ్యి వివాదంపై సినీనటుడు మోహన్ బాబు స్పందించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందూ పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి అని మోహన్ బాబు అన్నారు.
ఆ దైవానికి నిత్యం సమర్పించే లడ్డూలలో కలిపే ఆవు నెయ్యిలో దాదాపు 3 నెలల క్రితం వరకు ఇతర జంతువుల కొవ్వుని కలుపుతున్నారని తెలియగానే ఒక భక్తుడిగా తల్లడిల్లిపోయానని, తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మోహన్ బాబు తెలిపారు. నిత్యం తమ మోహన్ బాబు విశ్వవిద్యాలయం నుంచి కన్పించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతో పాటు వేలాది మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు, నిత్యం భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని చెప్పారు.
ఆ స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, నికృష్టం, అతినీచం, హేయం, అరాచకం అని అన్నారు. ఇదేగాని నిజమైతే నేరస్థులను శిక్షించాలని తన ఆత్మీయుడు, మిత్రుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని హృదయపూర్వకంగా కోరుతున్నానని చెప్పారు. ఈ కలియుగ దైవం వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు తన మిత్రుడు అందుకుని నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
విజ్ఞప్తి pic.twitter.com/7l8UT9Fbs5
— Mohan Babu M (@themohanbabu) September 21, 2024
మహాశాంతి యాగం..! తిరుమల లడ్డూ వివాదంతో టీటీడీ కీలక నిర్ణయం.. ఎన్ని రోజులు చేస్తారంటే..