Andhra pradesh- Telangana : తెలుగు రాష్ట్రాల్లో కోతులకు ఏమైంది? ఇళ్లనుంచి బయటకు రావటానికి హడలిపోతున్న జనాలు..!

తెలుగు రాష్ట్రాల్లో కోతులకు ఏమైంది? ఇళ్లనుంచి బయటకు రావటానికి హడలిపోతున్నారు జనాలు.

Andhra pradesh- Telangana : తెలుగు రాష్ట్రాల్లో కోతులకు ఏమైంది? చెట్లను వదిలి నివాసాలపై పడుతున్నాయి. మనుషులపై దాడి చేస్తున్నాయి. కంటికి కనిపించినవారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని తణఉకు మండలం మండపాకలో కోతులు కనిపిస్తేనే ప్రజలు హడలిపోతున్నారు. కాలు బయటపెట్టాలంటే భయపడిపోతున్నారు. తలుపులు బిగించుకుని ఆఖరికి కిటికీల తలుపులు కూడా లాక్ చేసుకుని ఇంటికే పరిమితమవుతున్నారు. ఏదైనా పని ఉండి బయటకు అడుగు పెడితే చాలు ఎక్కడినుంచి వస్తున్నాయో గానీ ఒక్కసారిగా మీద పడి దాడిచేస్తున్నాయి. ఇష్టానురీతిగా కొరికేసి గాయపరుస్తున్నాయి.

దీంతో మండపాక గ్రామంలోని ప్రజలు ఇంటినుంచి బయటకు రావాలంటే హడలిపోతున్నారు. గత రెండు రోజుల్లోనే గ్రామంలో ఎనిమిదిమందిపై కోతులు దాడి చేసి గాయపరిచాయి. కొరికి గాయపరుస్తున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లనుంచి కాలు బయటపెట్టాలంటే హడలిపోతున్నా పరిస్థితి. కోతుల దాడిలో గాయపడినవారు తణుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోతులు బెడద తప్పించాలని అధికారులను కోరుకుంటున్నారు. ఉన్నట్లుండి ఇలా మనుషుల మీద కోతులు దాడి చేయటంతో మండపాక వాసులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా కోతులకు ఏమైందో ఏమోగానీ..మహబూబాబాద్ జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 22,2023) ఊయ్యాలలో పడుకోబెట్టిన పసిబిడ్డపై కోతులు దాడిచేసింది. చిన్నారి కాలివేలును కోతులు కొరికేశాయి. విరారం గ్రామానికి చెందిన ఏర్పుల లావణ్య, సురేష్ దంపతులకు నెలన్నర పాప ఉంది. పాప పుట్టాక ఇంకా భర్త వద్దకు వెళ్లని లావణ్య మోదుగలగూడెంలోని తన పుట్టింట్లోనే ఉంటోంది. ఈక్రమంలో లావణ్య పాపను ఊయలలో పడుకోబెట్టి నీళ్లకోసం బయటకు వెళ్లింది. ఈలోగా కోతులు అకస్మాత్తుగా ఊయల వద్దకు చేరి చిన్నారిపై దాడి చేశాయి. పసికందు వేలును కొరికేశాయి.

కోతుల దాడికి పసిబిడ్డ ఏడటంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకుని కోతులను తరిమేశారు. ఆ తరువాత చిన్నారిని వెంటనే మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం.. మెరుగైన వైద్యం కోసం పసికందును వరంగల్‌కు తరలించారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కోతులకు ఏమైందో ఏంటో గానీ మనుషులపై దాడి చేయటం ఆందోళన కలిగిస్తోంది.

 

 

ట్రెండింగ్ వార్తలు