×
Ad

మొంథా తుపాను.. 27, 28, 29 తేదీల్లో ఈ ఉద్యోగుల సెలవులు రద్దు.. మీ జిల్లాల్లో మీకు సమస్యలు ఎదురైతే ఈ నంబర్‌కు ఫోన్ చేయండి..

ప్రజలు తెగిపోయిన వైర్లు, స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ అన్నారు.

Montha Cyclone: మొంథా తుపాను నేపథ్యంలో ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ (ఏపీఈపీడీసీఎల్) అప్రమత్తమైంది. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి దీనిపై వివరాలు తెలిపారు.

మొంథా తుపాను నేపథ్యంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా అన్ని చర్యలు చేపట్టామని పృథ్వీతేజ్ అన్నారు. సంస్థ పరిధిలోని 11 జిల్లాల్లో డివిజన్ వారీగా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. (Montha Cyclone)

ఉద్యోగులకు ఎప్పటికప్పుడు టెలీకాన్ఫెరెన్స్‌ల ద్వారా సూచనలు చేస్తున్నామని పృథ్వీతేజ్ తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ చర్యల పర్యవేక్షణ కోసం కార్పొరేట్ కార్యాలయం నుంచి సీజీఎం, ఎస్ఈ, ఈఈ, డీఈఈలు పనిచేస్తున్నారని వివరించారు.

సంస్థ పరిధిలోని అన్ని జిల్లాలలో డివిజన్, సెక్షన్ స్థాయి వరకు అధికారులు అందుబాటులో ఉన్నారని పృథ్వీతేజ్ తెలిపారు. తుపాను సహాయక కేంద్రాలకు, హాస్పిటళ్లకు, సెల్ టవర్లవంటి అత్యవసర సేవలకు నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

Also Read: మొంథా తుపాను వేళ వారు ఇలా చేస్తున్నారు.. అలాంటి వారిపై చర్యలు ఉంటాయి: హోంమంత్రి అనిత

పునరుద్ధరణ చర్యలకు జేసీబీలు, హ్యాండ్‌సెట్లు, పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు, జనరేటర్లు, మొబైల్ డీటీఆర్ రిపేర్ బృందాల వంటివాటిని మోహరించామని అన్నారు. సంస్థ పరిధిలోని ఇతర జిల్లాలతో పాటు ఇతర విద్యుత్ సంస్థల నుంచి కూడా సిబ్బంది, పోల్స్, ఇతర సామగ్రిని తుపాన్ ప్రభావ జిల్లాలకు తరలింపులో సంస్థ డైరెక్టర్లు నిమగ్నమయ్యారు. 27, 28, 29 తేదీల్లో ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రజలు తెగిపోయిన వైర్లు, స్తంభాల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలని పృథ్వీతేజ్ అన్నారు. విద్యుత్ సమస్యల కోసం 1912 నంబర్‌కు సమాచారమివ్వాలని చెప్పారు.

మొంథా తుపాను కంట్రోల్ రూమ్ నంబర్లు

విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం – 8331018762
కాకినాడ – 9493178718
పెద్దాపురం – 9059034479
జగ్గంపేట – 9490610096
అమలాపురం – 9490610101
రామచంద్రపురం – 9493178821
రాజమహేంద్రవరం రూరల్ – 9490610003
రాజమహేంద్రవరం టౌన్ – 9490610855
నరసాపురం – 7382050943
నరసాపురం – 9490610151
భీమవరం – 9490610143
ఏలూరు – 9440904037
జంగారెడ్డిగూడెం – 9491030712
అనకాపల్లి – 9490610023
కశింకోట – 8333811271
కశింకోట – 8333811272
నర్సీపట్నం – 9491030723
పాడేరు – 9440812511
రంపచోడవరం – 9059194449
విశాఖపట్నం
జోన్–I – 9490610018
జోన్–II – 9490610020
జోన్–III – 9491030721
శ్రీకాకుళం – 9440635529
టెక్కలి – 9490610050
పలాస – 7396615568
పలాస – 6281655632
పలాస – 9550568756
పలాస – 7981310114
పాలకొండ – 8332843546
పార్వతీపురం – 9492016109
విజయనగరం టౌన్ – 8465090654
విజయనగరం రూరల్ – 8332826430