MP MVV Satyanarayana
MVV Satyanarayana – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యాలపై విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తమ నిర్మాణాల దగ్గర పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ ని కిడ్నాప్ చేయడం వెనుక ఎవరి హస్తం లేదన్నారు. డబ్బులు కోసమే తమ ఫ్యామిలీ మెంబర్స్ ని కిడ్నాప్ చేశారని, పోలీసులు సకాలంలో స్పందించారని తెలిపారు. నిన్న శనివారం పవన్ పరిశీలించిన స్థలం పూర్తిగా ప్రవేటు స్థలమని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు.
ప్రశాంతంగా ఉన్న విశాఖను తాను నాశనం చేస్తున్నానని పవన్ చెప్పడం విడ్డురంగా ఉందన్నారు. తాను విశాఖ అభివృద్ధికి కలిసి వస్తానని పవన్ ముందుకు వచ్చి మాట్లాడాలని సూచించారు. టీడీఆర్ బాండ్ల గురించి పవన్ తెలియకుండా మాట్లాడుతున్నాడని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి పరిజ్ఞానం లేని వ్యక్తి ఎద్దేవా చేశారు.’నన్ను ఎందుకు గెలిపించారని పవన్ అడుగుతున్నాడు.. నేను గెలిచిన రోజు నుండి విశాఖలోనే ఉన్నాను, నువ్వు గాజువాకలో ఓడిపోయి ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేవు’ అని వెల్లడించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. తనను రాజీనామా చేయమని చెప్పడానికి పవన్ ఎవరని నిలదీశారు. ‘పవన్ గాజువాకలో ఓడిపోయావ్… మళ్ళీ పోటీ చెయ్యి, లేదా నాపై ఎంపీగా పోటీ చెయ్యి నువ్వెంటో తెలిసిపోతుంది’ అన్నారు. పవన్ కళ్యాణ్ కు సిగ్గు లేదని, అందుకే ఆయన సిగ్గు లేని ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. తాను 25ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నానని, తనపై ఎలాంటి మచ్చ లేదన్నారు. పవన్ సినిమాలు చేస్తున్నాడు.. అది వ్యాపారం కాదా.. డబ్బులు తీసుకోవడం లేదా అని నిలదీశారు.
పవన్ దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చెయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఇచ్చే 25 స్థానాల కోసం అడుక్కుంటూ ప్యాకేజి కోసం పవన్ చంద్రబాబు బూట్లు నాకు తున్నావని ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి, విశాఖకు, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాడో దమ్ముంటే చెప్పాలని సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ మాటల్లో ఆవేశం, యాక్టింగ్ తప్ప ఏమీ లేదని విమర్శించారు. విశాఖలో 2008లో పవన్ పై కేసు నమోదు అయ్యిందని తెలిపారు. పవన్ పెళ్లి చేసుకుని భార్యను వదిలేశాడని.. పుట్టిన పిల్లలను గాలికి వదిలేయడమే ఆయన తెలుసు అన్నారు.
మంగళగిరిలో 5 ఎకరాలను కేవలం రూ.20లక్షలకే కొనేశావని.. అక్కడ కోట్ల రూపాయల విలువ ఉందన్నారు.2024లో తామంతా మద్దతు ఇస్తాం చంద్రబాబుని నిన్ను ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయమని చెప్పు అని పవన్ ను ఛాలెంజ్ చేశారు. కేవలం 25సీట్ల కోసం పాకులాడుతున్నావని విమర్శించారు. సీబీసీఎన్సీ భూముల విషయంలో పవన్ మాటల్లో అర్థం లేదని, దున్నపోతుల మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. అన్న పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చిన పవన్.. భర్తగా ఫెయిల్యూర్ అయ్యాడని, ఆయన పిల్లలకు తండ్రి ఎవరో తెలియదన్నారు.
Varudu Kalyani: రుషికొండకే ఎందుకు.. లోకేష్ తోడల్లుడు యూనివర్సిటీకి వెళ్ళచ్చు కదా?
‘నీ కులాన్ని తాకట్టు పెడుతున్నావు.. నీ కులానికి ఏమి చేస్తావో చెప్పు, నీకంటే కేఏ పాల్ వెయ్యి రేట్లు బెటర్’ అని పవన్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవలేని వాడివి ఎంపీగా గెలిచినా తన గురించి మాట్లాడతావా అంటూ సీరియస్ అయ్యారు. విశాఖలో పవన్ కళ్యాణ్ జీవితం వెన్నుపోటుతో మొదలైందన్నారు. 2024లో తేల్చుకుందామని సవాల్ విసిరారు. 2024లో సీఎం అభ్యర్థి పవనా, లోకేశా, చంద్రబాబా చెప్పాలన్నారు.