జీఎన్ రావు కమిటీ నివేదికతో ఏకీభవిస్తున్నా: ఎంపీ సుబ్బిరామిరెడ్డి

జీఎన్ రావు కమిటీ నివేదికతో ఏకీభవిస్తున్నానని ఎంపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

  • Publish Date - December 27, 2019 / 06:02 AM IST

జీఎన్ రావు కమిటీ నివేదికతో ఏకీభవిస్తున్నానని ఎంపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

జీఎన్ రావు కమిటీ నివేదికతో ఏకీభవిస్తున్నానని ఎంపీ సుబ్బిరామిరెడ్డి తెలిపారు. రాష్ట్రం మధ్యలోనే రాజధాని ఉండాలనే నిబంధన లేదన్నారు. ఢిల్లీ, ఉమ్మడి ఏపీ రాజధాని హైదరాబాద్ కూడా ఓ పక్కకు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్యనిర్వహక రాజధానిగా విశాఖను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కార్యనిర్వహక రాజధానికి కావాల్సిన అన్ని వసతులు విశాఖకు ఉన్నాయని తెలిపారు. కార్యనిర్వహక రాజధానిగా విశాఖ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. 

తెలుగు ప్రజలకు హైదరాబాద్ తర్వాత విశాఖే పెద్ద సిటీ అని చెప్పారు. రాజధాని కోసం కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. జీఎన్ రావు కమిటీ రిపోర్టు చూడలేదు కానీ.. పేపర్ లో వచ్చిన ప్రకారం అమరావతిలో అసెంబ్లీ, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో హైకోర్టు ఉండాలని, బెంచ్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నివేదిక సమర్పిస్తున్నట్లు తెలిసిందన్నారు. నివేదిక సరిగ్గా ఉందో లేదో.. ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. నివేదిక ప్రజలకు ఉపయోగంగా ఉందా? లేదా అనేది ప్రభుత్వం నిర్ణయించాలని తెలిపారు.

అమరావతికి ఇబ్బంది కలుగకూడదన్నారు. ఎందుకంటే అమరావతిలో ఇప్పటికే డబ్బు ఖర్చు పెట్టారని తెలిపారు. రైతుల క్షేమం కూడా చూడాలన్నారు. రాజధాని సెంటర్ ప్లేస్ లో దొరికితే మేలేనని..లేకపోయినా ఇబ్బంది లేదన్నారు. విశాఖపట్నం సెంటర్ ప్లేస్ లో లేకపోయినా జీఎన్ రావు నివేదిక ప్రకారం విశాఖ…ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ఉపయోకరంగా ఉంటుందన్నారు. విశాఖపట్నం చుట్టూ చాలా స్థలం ఉందన్నారు. అక్కడ అంతకముందే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సరిపడా ఉందన్నారు. ఉమ్మడి ఏపీ విభజన కాకముందు తెలుగు ప్రజలకు హైదరాబాద్ తర్వాత విశాఖ బిగ్గెస్ట్ సిటీ అన్నారు. 

70 నుంచి 80 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేస్తే అమరావతిని డెవలప్ చేస్తే బాగానే వుంటుందన్నారు. కానీ డబ్బు పెట్టే శక్తి లేదన్నారు. అమరావతిలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లేదన్నారు. 
కాబట్టి రెడీ మేడ్ సిటీ విశాఖపట్నం..ఇండస్ట్రీస్ కు విశాఖ ప్రసిద్ధి అన్నారు. అంతకముందే విశాఖలో పరిశ్రమలు ఉన్నాయని…అక్కడికి పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. 

ప్రభుత్వం ఏం నిర్ణయించినా..అమరావతి రైతులు బాధపడుకుండా వారికి సహాయం చేయాలని కోరారు. అమరావతి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఇబ్బంది లేకుండా చేస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం బెస్టు ప్లేస్ అని అభిప్రాయపడ్డారు.