Vijaya Sai Reddy: బూతులు తిట్టించి, దీక్షలు చేయడం ఎందుకు?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయ‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

Vijay Sai Reddy

MP Vijaya Sai Reddy: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయ‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఢిల్లీ వెళ్లిన చంద్ర‌బాబు బృందానికి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్లు ఇవ్వకపోవడంపై చుర‌క‌లంటించారు విజయసాయి రెడ్డి. చంద్రబాబును జాతీయ మీడియా కూడా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి తిట్లను సమర్థించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వచ్చారా? అని ప్రశ్నించారు. అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబేనని, వ్యవస్థలను మేనేజ్‌ చేయడానికి ఢిల్లీ వచ్చారా? ఏం ప్రయోజనం కోసం వచ్చారు? అని నిలదీశారు. ఉద్దేశ్యపూర్వకంగానే పట్టాభితో తిట్టించి, దీక్షలు చేయడం ఎందుకు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి తిట్టడంపై ప్రజల్లో సహజంగా వ్యతిరేకత వ్యక్తమైందని అన్నారు.

గంజాయి వ్యాపారంలో లోకేష్‌కు భాగస్వామ్యం ఉందని, చంద్రబాబే ఒక టెర్రరెస్టు అని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్ర పరువును చంద్రబాబు తీస్తున్నారంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. పోలీస్‌ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర చంద్రబాబు చేస్తున్నాడని అన్నారు.