MP Vijayasai Reddy : చంద్రబాబు, ఆయన సామాజికవర్గం వారికే ఎక్కువ లాభం.. దసపల్లా భూముల వివాదంపై ఎంపీ విజయసాయి రెడ్డి

దసపల్లా భూములు ప్రభుత్వానికి కావదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రైవేట్ భూమి అయిన దసపల్లా భూములను 22ఏ లోంచి తీసేస్తే తప్పేముందన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చంద్రబాబు, ఆయన అనుచరులకే ఎక్కువ లాభం జరిగిందన్నారు.

MP Vijayasai Reddy : దసపల్లా భూములు ప్రభుత్వానికి కావదన్నారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రైవేట్ భూమి అయిన దసపల్లా భూములను 22ఏ లోంచి తీసేస్తే తప్పేముందన్నారు. ఈ భూముల్లో 400 ఇళ్లు కాకుండా మిగతా 64 మంది ప్లాట్ ఓనర్స్ లో 55 మంది చంద్రబాబు సామాజికవర్గానికే చెందిన వారున్నారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో చంద్రబాబు, చంద్రబాబు అనుచరులకే ఎక్కువ లాభం జరిగిందన్నారు విజయసాయిరెడ్డి.

”దసపల్లా భూములు ప్రభుత్వానివి కావు. ప్రైవేట్ భూమిని 22ఏ లోంచి తీసేస్తే తప్పేముంది? ప్రభుత్వ చర్యతో 400 కుటుంబాలకు మేలు జరిగింది. భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో నా పాత్ర లేదు. ఆస్తులన్నీ చంద్రబాబు సామాజిక వర్గం వారికే ఉన్నాయి ” అని విజయసాయి రెడ్డి అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

”దసపల్లా భూములపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేశాం. ఇందులోనూ బెనిఫిట్ పొందింది చంద్రబాబు సామాజిక వర్గం వారే. విశాఖలో జనం ఎక్కువగా వేరే సామాజికవర్గం వారంటే.. ఆస్తులన్నీ చంద్రబాబు సామాజిక వర్గం వారికే ఉన్నాయి. తనకు విశాఖ సీతమ్మ ధారలో మాత్రమే ఒక్క ప్లాట్ ఉంది. భూముల కొనుగోళ్లు, అమ్మకాల్లో నా పాత్ర ఎక్కడా లేదు. టీడీపీ నేతలు డిమాండ్ చేసినట్టుగా.. నా ఆస్తులపై సీబీఐ విచారణకు నేను సిద్ధం. మరి, మీరు సిద్ధమా? నేను ఇంతవరకు ఏ వ్యాపారం చేయలేదు. నా ప్రమేయం ఏదీ లేనప్పటికీ దసపల్లా భూముల వివాదంలో ఉద్దేశపూరకంగా నా పేరును వాడుతున్నారు” అని విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు.

విశాఖ రాజధాని ఏర్పాటు కాకూడదనే ఉద్దేశంతోనే టీడీపీ నేతలే దసపల్లా భూములను కొనుగోలు చేశారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. ఉత్తరాంధ్రకు ద్రోహం చేసే కార్యక్రమాలను టీడీపీ చేపడుతోందని ఆయన మండిపడ్డారు. దసపల్లా భూములకు సంబంధించి చంద్రబాబు ఎప్పుడో నిర్ణయం తీసుకోవాల్సిందన్నారు. ఇది ఆయన వైఫల్యమే అని విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు.

”గతంలో ఎప్పుడో ఈ భూములన్నీ కొనుగోలు చేసి ఈరోజు ఉత్తరాంధ్రకు రాజధాని రాకూడదు. అమరావతే రాజధానిగా ఉండాలి. కానీ, ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదు. అమరావతి అభివృద్ధి చెందుతూ ఉత్తరాంధ్ర డెవలప్ కాకుండా వారి ఆస్తుల విలువలు మాత్రం పెంచుకోవాలి అన్న ఒకే ఒక దురుద్దేశం వారిలో కనిపిస్తోంది. ఈ స్థలంపై నిజానికి చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఉండాలి. అది ఆయన వైఫల్యం. తెలుగుదేశం పార్టీ వైఫల్యం. ప్రజల్లో గందరగోళం సృష్టించి ఉత్తరాంధ్రకు రాజధాని రాకూడదన్న ఒకే ఒక ధ్యేయంతో అనుమానాలను రేకెత్తిస్తూ చేస్తున్న ఈ ప్రయత్నాలు బాధాకరం” అని విజయసాయి రెడ్డి వాపోయారు.

ట్రెండింగ్ వార్తలు