MTech Student : చదివింది ఎంటెక్… చేస్తుంది ఐస్ క్రీమ్ ల తయారీ

ఎంటెక్ చదివిన ఓ యువకుడు పలువురికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఐస్ క్రీమ్ లు తయారు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.

MTech student is ideal for youth : ఎంటెక్ చదివిన ఓ యువకుడు పలువురికి ఉపాధి కల్పించాలనే ఆలోచనతో ఐస్ క్రీమ్ లు తయారు చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. పాలకొల్లుకు చెందిన తమ్మినీడి సత్య ఎంటెక్‌ చదివారు. ప్రాంగణ ఎంపికల్లో పైకే సొల్యూషన్స్‌లో మెడికల్‌ కోడర్‌గా ఏడాదికి రూ.6.50 లక్షల ప్యాకేజీకి ఉద్యోగంలో చేరారు. అయితే ఇది అతడికి సంతృప్తి ఇవ్వలేదు. పబ్‌, ఐస్‌క్రీమ్‌ పార్లర్‌కు వెళ్లినప్పుడు వివిధ రుచుల గురించి ఆసక్తిగా తెలుసుకునేవారు. ఆ సమయంలో మనమెందుకు వ్యాపారం చేయకూడదనే ఆలోచన తట్టింది.

ఉద్యోగానికి రాజీనామా చేసి పాలకొల్లు మఠం వీధిలో ఐస్‌క్రీమ్‌ సిటీని ప్రారంభించారు. హైదరాబాద్‌, విజయవాడ, కాకినాడ వంటి నగరాల్లో మాత్రమే దొరికే స్టోన్‌, రోల్‌ ఐస్‌క్రీమ్‌లతో పాటు కొత్త రుచుల్లో తయారు చేస్తూ వ్యాపారాన్ని అభివృద్ధి చేశారు. రెండు నెలల్లోనే తనకంటూ మార్కెట్‌ను సృష్టించుకున్నారు.

ఉద్యోగం మానేసి వ్యాపారం చేస్తానన్నప్పుడు మా ఇంట్లో వాళ్లు ఆందోళనకు గురయ్యారు. పెళ్లి కూడా కాదని చెప్పారు. ముందుగా పెళ్లి చేసుకొని ఆ తరువాత వ్యాపారం వైపు వెళ్లడం కష్టం. నాకు నేనే సమాధానం చెప్పుకోవాలని పెద్దవాళ్లను ఒప్పించాను.

‘పది మందికి ఉపాధి కల్పించే స్థితిలో ఉండాలి. పది తరాలు తిన్నా తరగని ఆస్తి సంపాదించాలి. పదుల జీతం కోసం ఎదురు చూడకూడద’ని మా పెద నాన్న కాశీవిశ్వేశ్వరరావు నాలో స్ఫూర్తినింపారు. అదే నన్ను విజయ పథంలో నడిపిస్తోందని తమ్మినీడి సత్య తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు