మీ మనుషులతో మమ్మల్ని చంపించండి- ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

కొన్ని రోజులుగా భయంకరమైన బూతులు తిడుతూ తనకు మేసేజ్ లు పెడుతున్నారని, ఇటువంటి వాటిని కట్టడి చేయాలంటూ పవన్ కల్యాణ్ ను విజ్ఞప్తి చేశారు ముద్రగడ పద్మనాభం.

Mudragada Padmanabha Reddy : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తిడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి. ఇది మంచి పద్ధతి కాదన్నారాయన. అసభ్యకరంగా మేసేజ్ లు చేస్తూ టార్చర్ పెడుతున్నారని, అంతకంటే ఒక్కసారే చంపేయాలని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ పద్మనాభం. బూతులు మాట్లాడటం ఆపించాలని పవన్ ను వేడుకున్నారు ముద్రగడ.

తనను బూతులు తిడుతూ, మేసేజ్ లు పెడుతూ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని ముద్రగడ పద్మనాభ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అంతకంటే కూడా నా ఇంటికి రండి, నేను నా కుటుంబసభ్యులం మొత్తం ఏడు మంది ఉన్నాం. మా అందరినీ చంపేయండి అంటూ వాపోయారు. ఇకనైనా మేసేజ్ లు ఆపాలంటూ పవన్ కల్యాణ్ అభిమానులను వేడుకున్నారు. కొన్ని రోజులుగా భయంకరమైన బూతులు తిడుతూ తనకు మేసేజ్ లు పెడుతున్నారని, ఇటువంటి వాటిని కట్టడి చేయాలంటూ పవన్ కల్యాణ్ ను విజ్ఞప్తి చేశారు ముద్రగడ పద్మనాభం.

”పవన్ కల్యాణ్, జనసేన అభిమానులు బూతులతో ఇబ్బంది పెడుతున్నారు. ఇలా టార్చర్ పెట్టడం కంటే మమ్మల్ని చంపించండి. మేం అనాథలం. కాపుల హక్కుల కోసం నేను పోరాడలేని అసమర్థుడిని. చేతకానోడిని. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పవన్ చేతిలో ఉన్నాయి. కాబట్టి, కాపులకు రిజర్వేషన్లు ఇప్పించాలి. ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దుపైనా పవన్ ఆలోచన చేయాలి” అని ముగ్రదడ పద్మనాభం అన్నారు.

Also Read : నిధులు ఎందుకు మళ్లించారు? అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫైర్

ట్రెండింగ్ వార్తలు