vuyyuru Crime: ఉయ్యూరులో అందరూ చూస్తుండగానే వ్యక్తి పై హత్యాయత్నం

కృష్ణాజిల్లా ఉయ్యూరులో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Crime News

vuyyuru Crime: కృష్ణాజిల్లా ఉయ్యూరులో సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిపై కొందరు దుండగులు హత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..ఉయ్యూరు పట్టణ సెంటర్లో ఎలక్ట్రికల్ షాప్ నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని దుండగులు హత్య చేసేందుకు వచ్చారు. ఉదయాన్నే వచ్చి షాపు తెరుస్తున్న యజమానిని..దుండగులు బయటకు తీసుకువచ్చి, నడిరోడ్డుపై అత్యంత దారుణంగా నరికారు. ప్రజలు చూస్తుండగానే షాపు యజమానిని నరికిన దుండగులు అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. భయబ్రాంతులకు గురైన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also read: Parliament Meetings: లతా మంగేష్కర్ కు పార్లమెంటులో నివాళి

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎలక్ట్రికల్ షాప్ యజమాని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దుండగులు ఉపయోగించిన కత్తులను ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తూ దుండగులను గుర్తించే పనిలోపడ్డారు పోలీసులు. హత్యాయత్నం అనంతరం దుండగులు..పామర్రు, విజయవాడ, గుడివాడ వైపు వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Also read: SAGY List: ఆదర్శ గ్రామాల జాబితాలో 10లో 7 తెలంగాణవే, ఏఏ గ్రామాలంటే!