Amzath Basha (Photo : Google)
Amzath Basha-CM Jagan : కర్నూలు నగరానికి చెందిన కాంగ్రెస్ నేత పి.అహ్మద్ అలీ ఖాన్ వైసీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు సీఎం జగన్. అహ్మద్ అలీ ఖాన్ కాంగ్రెస్ తరపున 2014లో ఎమ్మెల్యేగా, 2019లో కర్నూలు ఎంపీ గా పోటీ చేశారని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చెప్పారు. కర్నూలు డీసీసీ ప్రెసిడెంట్ గానూ అహ్మద్ అలీఖాన్ పని చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో అలీఖాన్ సేవలను వైసీపీ వినియోగించుకుంటుందన్నారు. బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలకు జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
”గతంలో మైనార్టీలంటే వక్ఫ్ బోర్డు పదవులే దక్కేవి. ఇప్పుడు అన్ని స్థానాల్లో పలు పదవుల్లో ముస్లింలకు మేలు జరుగుతోంది. ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అహ్మద్ అలీ ఖాన్ కు గుర్తింపు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి అలీఖాన్ పార్టీలో చేరారు. కలిసికట్టుగా పని చేసి జగన్ ను మరోసారి సీఎం చేసుకుంటాం.
సంజీవ్ కుమార్, కర్నూలు ఎంపీ
నా చిన్ననాటి స్నేహితుడు వైసీపీలో చేరడం సంతోషంగా ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. గత ఎన్నికల్లో అలీ ఖాన్ కు 32వేల ఓట్లు వచ్చాయి. మైనార్టీ ఓట్లు చీలిపోకూడదు. అంతా ఒకటిగానే ఉండాలి. మైనార్టీలంతా వైసీపీకు ఓటు వేయాలి. మళ్లీ వైసీపీకి ఓటు వేస్తేనే మన సమస్యలను పరిష్కరించుకోగలం. యూనిఫాం సివిల్ కోడ్ చట్టాలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ముస్లింలు కలిసి కట్టుగా ఉంటే ఇలాంటి వాటిని ఎదుర్కోవచ్చు.
అహ్మద్ అలీఖాన్, వైసీపీ నేత
కాంగ్రెస్ పార్టీలో పలు పదవుల్లో ఉంటూ నేను దేశవ్యాప్తంగా పర్యటించా. ఏపీలోనే పారదర్శకంగా పాలన జరుగుతోంది. పాఠశాలలు చాలా బాగా అభివృద్ది చెందుతున్నాయి. ఏదో డిమాండ్ తో నేను పార్టీలో చేరలేదు. అధిష్టానం ఏది ఆదేశిస్తే అది చేస్తా. పోటీ విషయమై పార్టీ నుంచి నాకు ఎలాంచి హామీ లేదు.
Also Read..Ashok Gajapathi Raju: అంతుబట్టని అశోక్ గజపతిరాజు అంతరంగం.. ఇంతకీ ఆయన మనసులో ఏముంది?
రామసుబ్బారెడ్డి, వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్
రాష్ట్ర స్థాయిలో అహ్మద్ అలీఖాన్ సేవలను వినియోగించుకుంటాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సీఎం సమూలంగా మార్చారు. నాడు-నేడు కింద పాఠశాలలను అభివృద్ది చేశారు. రాష్ట్రంలో పేదల ముంగిటకు పరిపాలన జరుగుతోంది. జగన్ పై రాజకీయంగా బురదజల్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జగన్ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఉంది. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ను ప్రజలు ఎన్నుకుంటారు. కర్నూలు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యేనూ గెలిపించేందుకు అహ్మద్ అలీఖాన్ కృషి చేస్తారు.