టీడీపీలో చేరిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్

మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు.

Vasantha Krishna Prasad

Vasantha Krishna Prasad : మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరారు. ఇవాళ ఉదయం చంద్రబాబు నివాసానికి వెళ్లిన కృష్ణప్రసాద్.. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. కృష్ణ ప్రసాద్ తో పాటు మైలవరం నియోజకవర్గంకు చెందిన పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణ ప్రసాద్ కు సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి టికెట్ నిరాకరించారు. దీంతో ఆయన వైసీపీ రాజీనామా చేశారు. ప్రస్తుతం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అయితే, టీడీపీ అభ్యర్థిగా మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ పోటీ చేస్తారని తెలుస్తోంది.