Naga Babu: జర్మనీలో నాగబాబుకు ఘనస్వాగతం.. యూరప్‌లో బిజీ బిజీ

వారం రోజులుగా యూరోప్ లో పర్యటిస్తున్న నాగబాబు మూడు రోజుల పాటు లండన్, రెండు రోజులు ఐర్లాండ్ లో జనసేన పార్టీ మద్దతుదారులు, ఎన్ఆర్ఐ విభాగం సభ్యులతో సమావేశాలు నిర్వహించారు.

Naga Babu

Naga Babu – JanaSena: యూరప్‌ (Europe) పర్యటనలో ఉన్న జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ఇవాళ జర్మనీ (Germany) చేరుకున్నారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. మ్యూనిచ్ విమానాశ్రయంలో నాగబాబుకు జనసేన జర్మనీ ఎన్ఆర్ఐ విభాగ సభ్యులు ఘన స్వాగతం పలికారని వివరించింది.

మ్యూనిచ్ నగరంలో జర్మనీకి చెందిన జన సైనికులు, వీర మహిళలతో ఆయన ఆత్మీయ సమావేశంలో పాల్గొంటారని పేర్కొంది. జనసేన పార్టీ బలోపేతం, పార్టీ ఉన్నతికి జర్మనీలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అందిస్తున్న సేవలు, భవిష్యత్తు కార్యక్రమాల మీద వారితో సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చిస్తారని తెలిపింది.

ఈ కార్యక్రమంలో పార్టీ ఆస్ట్రేలియా కన్వీనర్ శశిధర్ కొలికొండ కూడా పాల్గొంటున్నారని పేర్కొంది. వారం రోజులుగా యూరోప్ లో పర్యటిస్తున్న నాగబాబు మూడు రోజుల పాటు లండన్, రెండు రోజులు ఐర్లాండ్ లో జనసేన పార్టీ మద్దతుదారులు, ఎన్ఆర్ఐ విభాగం సభ్యులతో సమావేశాలు నిర్వహించారు. ఈ నెలాఖరుకు నెదర్లాండ్స్ కూడా చేరుకుంటారు.

YS Sharmila Reddy : బీఆర్ఎస్ లో ఉన్నవారంతా అలాంటి ఎమ్మెల్యేలె.. వైఎస్ షర్మిల రెడ్డి సంచలన వ్యాఖ్యలు