Chittur : దత్తత తీసుకున్న అమ్మాయి నీట్‌లో గ్రేట్, మురిసిపోయిన ఎమ్మెల్యే రోజా

నగరి ఎమ్మెల్యే రోజా...దత్తత తీసుకున్న చిన్నారి నీట్ లో గ్రేట్ అనిపించింది. 89 శాతం మార్కులు సాధించి..తన పుట్టినరోజుకు కానుక ఇచ్చిందని తనకు చాలా సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్యే రోజా.

Roja

MLA Roja adopted Pushpa : చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే రోజా…దత్తత తీసుకున్న చిన్నారి నీట్ లో గ్రేట్ అనిపించింది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టులో అద్భుత ప్రతిభను చూపారు. నీట్ లో 89 శాతం మార్కులు సాధించి..తన పుట్టినరోజుకు కానుక ఇచ్చిందని తనకు చాలా సంతోషంగా ఉందని రోజా వెల్లడించారు. ఈ విషయాన్ని స్వయంగా రోజా పంచుకున్నారు. ట్విట్టర్ వేదికగా…ట్వీట్ చేశారు. చిన్నారితో దిగిన ఫొటోలు పంచుకున్నారు. సీఎం జగన్ జన్మదినం సందర్భంగా..గత సంవత్సరం రోజా…ఆమెను దత్త తీసుకున్న సంగతి తెలిసిందే.

Read More : Vat Petrol : పెట్రోల్‌పై వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రాలు, మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటీ ?

 

విద్యార్థిని పుష్పకుమారి. చిన్న వయస్సులోనే..తల్లిదండ్రులు చనిపోవడంతో అనాథ అయ్యింది. తిరుపతిలోని గర్ల్స్ హోమ్ లో విద్యనభ్యసిస్తున్నారు. గత సంవత్సరం ఎమ్మెల్యే రోజా..గర్ల్స్ హోమ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి పుష్పతో మాట్లాడారు. తన లక్ష్యం ఏంటో పుష్ప వివరించారు. చదువుకోవాలని ఉందని..కానీ తల్లిదండ్రుల అండ లేకపోవడం, ఆర్థిక స్థోమత లేదని తెలిపారు. దీంతో పుష్ప లక్ష్యాన్ని తాను నెరవేర్చాలని రోజా భావించారు.

Read More : Tamil Nadu : పోలీసులకు వీక్లీ ఆఫ్

సీఎం జగన్ జన్మదినం సందర్భంగా…డిసెంబర్ 21వ తేదీన పుష్పను దత్తత తీసుకున్నారు. MBBS చదివించడానికి అవసరమైన ఖర్చును భరిస్తానని రోజా హామీనిచ్చారు. ప్రతి పేద విద్యార్థి…అత్యున్నత చదువులు చదవాలని…అమ్మ ఒడి, ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్ బోధన, నాడు – నేడు వంటి పథకాలను అమలు చేస్తున్న వైఎస్ జగన్ వంటి మంచి మనిషి జన్మదినాన…పుష్పకుమారిని దత్తత తీసుకుంటున్నట్లు ఆనాడు రోజా చెప్పారు. రోజా చేసిన మంచి పనిని చాలా మంది హర్షించారు.

Read More : Zika Virus : యూపీలో జీకా కలవరం…25 కేసులు

ఇప్పుడు పుష్ప…నీట్ లో రాణించారు. 89 శాతం మార్కులను సాధించి గ్రేట్ అనిపించుకున్నారు. తనకు పుట్టిన రోజు కానుక ఇచ్చిందంటూ రోజా చెప్పారు. ఈ సందర్భంగా.. కుటుంబసభ్యలతో పుష్ప దిగిన ఫొటోలు సోషల్ మీడియో పోస్టు చేశారు ఎమ్మెల్యే రోజా.