Vat Petrol : పెట్రోల్‌పై వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రాలు, మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటీ ?

రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు.

Vat Petrol : పెట్రోల్‌పై వ్యాట్ తగ్గిస్తున్న రాష్ట్రాలు, మరి తెలుగు రాష్ట్రాల పరిస్థితి ఏంటీ ?

Telugustates Petrol

Telugu States Petrol ? : కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. పెట్రోల్‌, డీజిల్‌పై 7 రూపాయల మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు అసోం, త్రిపురా, కర్ణాటక, గోవా, సిక్కిం రాష్ట్రాలు ప్రకటించాయి.. దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర 12, డీజిల్‌ ధర 17 రూపాయల మేర తగ్గబోతోంది.. బీహార్‌లోని జేడీయూ-బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌పై 1.30 రూపాయలు, డీజిల్‌పై 1.90 రూపాయల మేర వ్యాట్‌ తగ్గించింది.. ఉత్తరాఖండ్‌ పెట్రోల్‌పై 2 రూపాయలు తగ్గించింది.. ఇక ఉత్తరప్రదేశ్‌ లీటర్‌పై 12 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గుజరాత్‌ కూడా పెట్రోల్‌, డీజిల్‌ పై 7 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

Read More : Petrol : హమ్మయ్య..తగ్గిన పెట్రో ధరలు..హైదరాబాద్‌లో ఎంతంటే

మరి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. ఇప్పటికే కేంద్రం తగ్గింపుతో పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 11 రూపాయల మేర ధరలు దిగి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌లు పెరుగుతున్నాయి. ఇక్కడి ప్రభుత్వాలు కూడా వ్యాట్‌పై తగ్గింపు నిర్ణయం తీసుకుంటే.. ఇందన ధరలు మరింత తగ్గనున్నాయి.

Read More : Indian Air Force : అభినందన్‌కు పదోన్నతి..గ్రూప్ కెప్టెన్ ర్యాంక్

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పెట్రోల్‌పై 32.5 శాతం వ్యాట్‌ విధిస్తోంది. కేంద్రం బాటలో నడిచి దీన్ని సవరిస్తారా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ విమర్శల వర్షం ప్రారంభించారు. తమ ప్రభుత్వం పన్ను తగ్గించింది.. మరీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? అని ప్రశ్నిస్తున్నారు.. ఇక ఏపీ ప్రభుత్వం కూడా దీనిపై ఇంకా స్పందించలేదు.

Read More : PM Modi : కేదర్ నాథ్‌‌కు మోదీ…దీపావళి రోజు…800 కిలోల పూలతో అలంకరణ

పెట్రోల్‌, డీజీల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర తగ్గించడంతో లక్ష కోట్ల మేర ఆదాయం తగ్గుతుంది. దేశంలో ఇంధర ధరలు అంతకంతకు పెరుగుతూ ఆకాశాన్నంటే స్థితికి వచ్చింది. దీంతో ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం.. దానికి తోడు కట్టడి చేయలేని స్థితికి ద్రవ్యోల్బణం చేరుకున్నాయి. వీటికి తోడు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీని ఎప్పుడో దాటేశాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో అయతే లీటర్‌ పెట్రోల్ ధర అయితే ఏకంగా 120 దాటేసింది. దీంతో అన్ని వైపుల నుంచి విమర్శలతో కేంద్రం ఉక్కిరిబిక్కిరైంది. కేంద్రం ఓ మెట్టు దిగి వచ్చి ఎక్సైజ్‌ డ్యూటీలో కోత విధించుకుంది.