Indian Air Force : అభినందన్‌కు పదోన్నతి..గ్రూప్ కెప్టెన్ ర్యాంక్

అభినందన్‌ వర్ధమాన్‌కు పదోన్నతి లభించింది. కమాండర్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది.

Indian Air Force : అభినందన్‌కు పదోన్నతి..గ్రూప్ కెప్టెన్ ర్యాంక్

Iaf

Abhinandan Varthaman : ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు పదోన్నతి లభించింది. కమాండర్‌ నుంచి గ్రూప్‌ కెప్టెన్‌గా నియమిస్తూ భారత వైమానికదళం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌ కెప్టెన్‌ ర్యాంక్‌ అనేది సైనికదళంలో కల్నల్‌ ర్యాంక్‌తో సమానం. 2019 ఫిబ్రవరిలో జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు బాంబు దాడి చేశారు. ఈ ఘటనలో భారత జవాన్లు అమరులుకాగా, పలువురు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా ఫిబ్రవరి 27న భారత వాయుసేన మెరుపు దాడులు చేసింది.

Read More : Zika Virus : యూపీలో జీకా కలవరం…25 కేసులు

బాలకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను బాంబులతో పేల్చివేసింది. ఆ ఘర్షణలో ధైర్యసాహసాలు చూపిన భారత వైమానికదళ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ విమానం కూలిపోవడంతో పారాచూట్‌ సాయంతో పాక్‌ భూభాగంలో దిగారు. దీంతో అతడిని పాక్‌ జవాన్లు అదుపులోకి తీసుకొని చిత్రహింసలు పెట్టారు.

Read More : PM Modi : కేదర్ నాథ్‌‌కు మోదీ…దీపావళి రోజు…800 కిలోల పూలతో అలంకరణ

అభినందన్‌ను తిరిగి అప్పగించాలని భారత్‌ నుంచే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై ఒత్తిడి పెరిగింది. దీంతో పాక్‌ సైన్యం అతడిని వాఘా సరిహద్దు వద్ద ఇండియాకు అప్పగించింది. చికిత్స కోసం కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న అభినందన్‌ తిరిగి విధుల్లో చేరి దేశ సేవను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే అభినందన్‌కు పదోన్నతి దక్కింది. పాక్‌ వైమానికదళంతో వీరోచితంగా పోరాడినందుకుగానూ అభినందన్‌ను భారత ప్రభుత్వం 2019లోనే వీర్‌ చక్ర అవార్డుతో సత్కరించింది.