Zika Virus : యూపీలో జీకా కలవరం…25 కేసులు

ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరస్‌లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే డెంగీతో సతమతమవుతున్న యూపీలో తాజాగా జీకా కలవర పెడుతోంది.

Zika Virus : యూపీలో జీకా కలవరం…25 కేసులు

Up Zika

Updated On : November 4, 2021 / 7:59 AM IST

Uttar Pradesh Zika Virus : ఉత్తర్‌ప్రదేశ్‌లో వైరస్‌లు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే డెంగీతో సతమతమవుతున్న యూపీలో తాజాగా జీకా కలవర పెడుతోంది. కాన్పూర్‌లో జికా వైరస్‌ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. 2021, నవంబర్ 03వ తేదీ బుధవారం ఒక్కరోజే కొత్తగా 25 కేసులు వెలుగులోకి వచ్చాయి. జికా సోకినవారిలో ఓ గర్భిణి కూడా ఉన్నట్టు సమాచారం. గతంలో 11 కేసులు ఉండగా.. తాజాగా నమోదైన కొత్త కేసులతో కలిపి కాన్పూర్‌లో మొత్తం జికా కేసుల సంఖ్య 36కి పెరిగింది.

Read More : Puneeth Rajkumar : పునీత్ రాజ్ కుమార్ పై అసభ్య‌క‌ర‌మైన పోస్ట్‌ చేసిన యువకుడు అరెస్ట్

వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు చర్యలు ముమ్మరం చేసింది ప్రభుత్వం. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తించే పనిలో ఉన్నారు. మొత్తం 150 బృందాలతో శానిటేషన్‌, ఫాగింగ్‌ చేస్తున్నారు. 4 వందల నుంచి 5 వందల ఇళ్లలో ఉన్నవారి నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది యూపీ ప్రభుత్వం. పర్దేవాన్‌పూరలో మొదట అక్టోబర్ 23న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారికి జీకా వైరస్ సోకినట్టు నిర్ధారించారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు వైద్యులు.

Read More : New Hair Growth : బట్టతలకు ఇక్ గుడ్‌బై.. కొత్త వెంట్రుకలు మొలిచే టెక్నిక్..!

జీకా బారిన పడుకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. రెండు నెలల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలకు దోమ తెరను వాడాలని సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని…వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు అధికారులు.