Petrol : హమ్మయ్య..తగ్గిన పెట్రో ధరలు..హైదరాబాద్‌లో ఎంతంటే

Petrol Rate India, Hyderabad Litre Petrol Rate

Petrol : హమ్మయ్య..తగ్గిన పెట్రో ధరలు..హైదరాబాద్‌లో ఎంతంటే

Petrol Rate

Petrol Rate India : పెట్రోల్‌, డీజీల్‌పై కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించింది. పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 10 రూపాయల మేర తగ్గించడంతో లక్ష కోట్ల మేర ఆదాయం తగ్గుతుంది. దేశంలో ఇంధర ధరలు అంతకంతకు పెరుగుతూ ఆకాశాన్నంటే స్థితికి వచ్చింది. దీంతో ప్రజల్లో పెరుగుతున్న ఆగ్రహం.. దానికి తోడు కట్టడి చేయలేని స్థితికి ద్రవ్యోల్బణం చేరుకున్నాయి. వీటికి తోడు దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సెంచరీని ఎప్పుడో దాటేశాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో అయతే లీటర్‌ పెట్రోల్ ధర అయితే ఏకంగా 120 దాటేసింది. దీంతో అన్ని వైపుల నుంచి విమర్శలతో కేంద్రం ఉక్కిరిబిక్కిరైంది. కేంద్రం ఓ మెట్టు దిగి వచ్చి ఎక్సైజ్‌ డ్యూటీలో కోత విధించుకుంది.

Read More : Offline Whatsapp Trick: ఈ ట్రిక్‌తో ఇంటర్నెట్ ఆఫ్ చేయకుండానే.. మీ వాట్సాప్‌ ఆఫ్‌లైన్ చేయొచ్చు..!

ఇక కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించగానే.. అదే బాటలో నడిచాయి బీజేపీ పాలిత రాష్ట్రాలు.. పెట్రోల్‌, డీజిల్‌పై 7 రూపాయల మేర వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు అసోం, త్రిపురా, కర్ణాటక, గోవా, సిక్కిం రాష్ట్రాలు ప్రకటించాయి.. దీంతో ఆ రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర 12, డీజిల్‌ ధర 17 రూపాయల మేర తగ్గబోతుంది.. బిహార్‌లోని జేడీయూ-బీజేపీ ప్రభుత్వం పెట్రోల్‌పై 1.30 రూపాయలు, డీజిల్‌పై 1.90 రూపాయల మేర వ్యాట్‌ తగ్గించింది.. ఉత్తరాఖండ్‌ పెట్రోల్‌పై 2 రూపాయలు తగ్గించింది.. ఇక ఉత్తరప్రదేశ్‌ లీటర్‌పై 12 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.. గుజరాత్‌ కూడా పెట్రోల్‌, డీజిల్‌ పై 7 రూపాయలు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.

Read More : Australia : చిన్నారి కిడ్నాప్, దేశం మొత్తమే ప్రార్థించింది..18 రోజుల తర్వాత

కేంద్రం ఎక్సైజ్‌ డ్యూటీపై తగ్గింపుపై విపక్షాలు ఫైర్‌ అయ్యాయి. గతేడాది కరోనా కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు.. భారత్‌లో మాత్రం తగ్గలేదు.. దాన్ని సమం చేస్తూ గతేడాది మార్చి, మే నెలల్లో ఎక్సైజ్‌ డ్యూటీని పెట్రోల్‌పై లీటర్‌కు 32 రూపాయల 90 పైసలు.. డీజిల్‌పై 31 రూపాయల 8 పైసలకు పెంచారు.. ఈ పెంపు ఎఫెక్ట్ తో గతేడాది మే 5 నుంచి ఇప్పటి వరకు పెట్రోల్‌ ధర 38 రూపాయల 78 పైసలు పెరగగా.. డీజిల్‌పై 29 రూపాయల మేర పెరిగింది. ఈ స్థాయిలో ధరల పెరుగుదల అనేది కనీవిని ఎరుగదనే చెప్పాలి. ఏడాదిలో ధరల పెంపు మహా అయితే 5 నుంచి 10 రూపాయలు ఉంటుంది.. కానీ గత ఏడాదిన్నరగా మాత్రం అది 38 రూపాయలకు చేరింది.. ఇప్పుడు ఇదే అంశాన్ని విపక్షాలు తమ అస్త్రంగా మార్చుకున్నాయి.. 2014లో బ్యారెల్‌ చమురు ధర 105 డాలర్లు ఉన్నప్పుడు పెట్రోల్‌ ధర 71 రూపాయలు, డీజిల్‌ 55 రూపాయలుగా ఉండేదని.. ఇప్పుడు బ్యారెల్ ధర కేవలం 82 డాలర్లు ఉందని.. కానీ ఇంధన ధరలు మాత్రం సెంచరీ దాటాయని విమర్శించింది.. 28 రూపాయలకు పెంచి.. 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెప్పుకోవడం బీజేపీకే చెల్లిందంటూ ఫైర్‌ అయ్యారు.

Read More : Voter ID Address Change: మీ స్మార్ట్ ఫోన్‌తో ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..!

– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.103.97.. డీజిల్‌ రూ.98.42
– చెన్నైలో పెట్రోల్‌ రూ.101.40.. డీజిల్‌ రూ.102.69
– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.101.71.. డీజిల్‌ రూ.99.02
– నోయిడాలో పెట్రోల్‌ రూ.101.29.. డీజిల్‌ రూ.99.32

Read More : Aliya Bhat : జీవితాంతం తండ్రి సంపాదించిన డబ్బును రెండేళ్లలో సంపాదించిన స్టార్ హీరోయిన్

– బెంగళూరులో పెట్రోల్‌ రూ.107.64.. డీజిల్‌ రూ.104.50
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.104.73.. డీజిల్‌ రూ.107.57
–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.100.12.. డీజిల్‌ రూ.98.16

Read More : T20 World Cup 2021 ఎట్టకేలకు భారత్ బోణీ.. అప్ఘానిస్తాన్ పై ఘన విజయం

– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.108.20.. డీజిల్‌ రూ.107.40
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.110.76.. డీజిల్‌ రూ 109.18
– విజయవాడలో రూ.110.76 డీజిల్‌ రూ.109.09