Australia : చిన్నారి కిడ్నాప్, దేశం మొత్తమే ప్రార్థించింది..18 రోజుల తర్వాత

ఆస్ట్రేలియాలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే ఎట్టకేలకు 18 రోజుల తర్వాత ఆ చిన్నారి తల్లిదండ్రుల చెంతకు చేరింది.

Australia : చిన్నారి కిడ్నాప్, దేశం మొత్తమే ప్రార్థించింది..18 రోజుల తర్వాత

Aus

My Name Is Cleo : ఆస్ట్రేలియాలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. అయితే ఎట్టకేలకు 18 రోజుల తర్వాత ఆ చిన్నారి తల్లిదండ్రుల చెంతకు చేరింది. నాలుగేళ్ల చిన్నారి క్లియో స్మిత్‌ని దుండగుడు కిడ్నాప్ చేయడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు, డిటెక్టివ్‌లు, స్థానికులు విస్తృత గాలింపు చేపట్టి చిన్నారిని  రక్షించారు. ఉత్తర ఆస్ట్రేలియాకు చెందిన క్లియో.. 18 రోజుల క్రితం తన తల్లిదండ్రులతో  కలిసి పిక్నిక్‌కు వెళ్లింది. రాత్రి తన టెంట్‌లో నిద్రిస్తుండగా దుండగుడు క్లియోని కిడ్నాప్‌ చేశాడు.

Read More : Diwali : దీపావళి ఫుల్ జోష్, పెద్ద మొత్తంలో పండుగ ఖర్చుకు రెడీ

ఉదయం నిద్రలేచిన క్లియో తల్లిదండ్రులకు ఆమె కనిపించలేదు. ఆ ప్రాంతం అంత వెదికారు. ఎక్కడా క్లియో జాడ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె ఆచూకీ చెప్పాలంటూ సోషల్‌ మీడియా వేదికగా అభ్యర్థించారు. క్లియో క్షేమంగా ఇంటికి చేరుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్లియో తల్లిదండ్రులకు మద్దతుగా నిలిచారు జనాలు.

Read More : Voter ID Address Change: మీ స్మార్ట్ ఫోన్‌తో ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..!

కిడ్నాపర్ స్థావరం గురించి పోలీసులుకు సమాచారం అందగా…ఆ ప్రాంతాన్ని చుట్టుమట్టారు. అక్కడ ఓ గదికి తాళం వేసి ఉండటం గమనించారు. దాన్ని పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా.. వారి ఎదురుగా క్లియో కనిపించింది. తన పేరు అడిగిన పోలీసులకు మై నేమ్ ఇస్ క్లియో అని బదులిచ్చింది. దీంతో కన్ఫార్మ్‌ చేసుకున్న పోలీసులు హుటాహుటిన క్లియోని అక్కడ నుంచి కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. చిన్నారి క్లియో ఏమాత్రం బెదరకుండా.. ధైర్యంగా ఉండటం చూసి పోలీసులు, డిటెక్టివ్‌లు ఆశ్చర్యపోయారు. చిన్నారి ధైర్యాన్ని మెచ్చుకున్నారు.