Diwali : దీపావళి ఫుల్ జోష్, పెద్ద మొత్తంలో పండుగ ఖర్చుకు రెడీ

దేశవ్యాప్తంగా 16 వందల 97 మందితో మాట్లాడిన తర్వాత వారి ప్రతిస్పందనల ఆధారంగా అధ్యయన నివేదికను తయారుచేశారు.

Diwali : దీపావళి ఫుల్ జోష్, పెద్ద మొత్తంలో పండుగ ఖర్చుకు రెడీ

Diwali1

Diwali Festival : దీపావళి పండుగ సందర్భంగా పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి జనం సిద్ధమయ్యారు. గత ఏడాది కరోనా వ్యాప్తితో ఇంటిపట్టునే ఉన్న జనం.. ఈసారి దీపావళి పండుగను ఎంజాయ్‌ చేసేందుకు రెడీ అయ్యారు. 75 శాతం మంది ఈ పండక్కి ఎక్కువగా ఖర్చు చేయాలనుకున్నారని ఇంటర్‌మైల్స్‌ సర్వే చెప్తోంది.

Read More : Indian Air Force : అభినందన్‌కు పదోన్నతి..గ్రూప్ కెప్టెన్ ర్యాంక్

వినియోగదారుల ఖర్చుల అలవాట్లను అంచనా వేసేందుకు ఇంటర్‌మైల్స్‌ సంస్థ అధ్యయనం జరిపింది. దేశవ్యాప్తంగా 16 వందల 97 మందితో మాట్లాడిన తర్వాత వారి ప్రతిస్పందనల ఆధారంగా అధ్యయన నివేదికను తయారుచేశారు. లాయల్టీ, రివార్డ్ ప్రోగ్రాం సంస్థ అయిన ఇంటర్‌మైల్స్‌ కన్స్యూమర్ స్పెండింగ్ సెంటిమెంట్ ఇండెక్స్ రిపోర్ట్’ పేరుతో తన సెకండ్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. షాపింగ్ కోసం ఖర్చు చేయడానికి ఎంత ఓపెన్‌గా ఉన్నారని పలువురిని ప్రశ్నించగా.. మెజారిటీ ప్రజలు ఆశావాదంతో ప్రతిస్పందించారు. 75 శాతం మంది కరోనా వ్యాప్తికి ముందు లాగా షాపింగ్ కోసం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

Read More : Voter ID Address Change: మీ స్మార్ట్ ఫోన్‌తో ఓటర్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..!

వీరిలో ఎక్కువ మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ సమయం నుంచి ఈ ధోరణి మరింత పెరిగిపోయింది. ఇక అధ్యయనంలో పాల్గొన్న వారిలో చాలా మంది క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపేందుకే మొగ్గు చూపుతున్నారు. రివార్డ్ పాయింట్లను సేకరించడం, క్రెడిట్ స్కోర్లను పెంచుకోవడం, ప్రత్యేకమైన డిస్కౌంట్‌లు, ప్రయోజనాలకు కూడబెట్టుకోవడానికి క్రెడిట్‌ కార్డులను స్వైప్ చేసేందుకు ముందుకు వస్తున్నట్లు చెప్పారు. 20 శాతం మంది యూపీఐ ద్వారా, 10 శాతం మంది డెబిట్ కార్డ్‌ల ద్వారా, 5 శాతం ఇ-వాలెట్‌ల ద్వారా లావాదేవీలు చేసేందుకు ఇష్టపడటంతో.. ఈ నగదు రహిత చెల్లింపులు కూడా ప్రజాదరణ పొందాయి.