Akkineni Nagarjuna: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నాగార్జున అమలా దంపతులు

స్వామి వారి సేవలో పాల్గొన్న నాగార్జున దంపతులకు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.

Nag

Akkineni Nagarjuna: ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున సతీమణి అమలతో కలిసి శుక్రవారం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి వారి దర్శనానికి వచ్చిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామి వారి సేవలో పాల్గొన్న నాగార్జున దంపతులకు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.

Also read: Crime News: “పుష్ప లాగా ఎదగాలని” హంతకులుగా మారిన మైనర్లు

అనంతరం ఆలయం వెలుపల నాగార్జున మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాల తర్వాత స్వామి వారిని దర్శించుకున్నాని అన్నారు. ఈ ఏడాది కరోనా అంతమై ప్రపంచంలో ప్రజలందరూ బాగుండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. తాను నటించిన బంగార్రాజు చిత్రాన్ని కరోనా సమయంలోనూ ఆదరిస్తున్న ప్రేక్షకులకు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ఆలయం వెలుపల నాగార్జున దంపతులను కలిసి ఫోటోలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు.

Also read: Fever Survey: తెలంగాణలో ఫీవర్ సర్వే, లక్షణాలు ఉంటే వైద్య కిట్లు అందజేత