Nara bhuvaneswari
Chandrababu Arrest ..Nara bhuvaneswari : వ్యాపార లావాదేవీల విషయాల్లో తప్ప రాజకీయంగా ఎటువంటి జోక్యం చేసుకోని నారా భువనేశ్వరి భర్త చంద్రబాబు అరెస్ట్ తరువాత బయటకొచ్చి చేస్తున్న వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన భర్త చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని..నిత్యం ప్రజల క్షేమం కోసం సంక్షేమం కోసం తపనపడే వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. చంద్రబాబుని ఇబ్బంది పెట్టాలని కావాలని జైల్లో ఉంచి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని కానీ ఆయన చాలా గట్టి మనిషి చాలా నిబ్బరంగా ఉన్నారని జైల్లో ఉన్నా ప్రజల కోసమే ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.
చంద్రబాబుతో ములాకత్ తరువాత భువనేశ్వరి ప్రజల్లో తిరుగుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిసనలు చేసే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాల్లో చాలా సమన్వయంగా మాట్లాడుతు..ఆయన బయటకు వస్తారు..మీ అభిమానంతో తిరిగి ప్రజల కోసమే పనిచేస్తారని..మీరంతా ఆయనకు మద్దతుగా ఉండాలనే పిలుపునిస్తున్నారు. ఇలా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్న నారా భువనేశ్వరి తన భర్త త్వరగా తిరిగా రావాలని ఆయనకు మానసిక స్థైరాన్ని ఇచ్చి న్యాయాన్ని గెలిపించాలి అంటూ దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత భువనేశ్వరి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.
Chandrababu Quash Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు, విచారణ చేసే బెంచ్ ఇదే.. ఊరట లభిస్తుందా?
ఈక్రమంలో చంద్రబాబు దాఖలు చేసిన పిటీషన్లకు కోర్టుల్లో చుక్కెదురు కావటం..దీంతో చంద్రబాబు క్వాష్ పిటీషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేయటం అది కూడా విచారణకు రావటానికి సమయం పడుతోంది. ఈక్రమంలో భువనేశ్వరి చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తున్నారు. ఓ పక్క న్యాయపరంగా జరుగుతున్న ప్రక్రియల గురించి తెలుసుకుంటునే మరోపక్క కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.దీంట్లో భాగంగా నారా భువనేశ్వరి ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా నిర్వహిస్తున్న దీక్షా శిబిరాన్ని సందర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు ఆమె రాజమండ్రి జాంపేటలోని సెయింట్ పాల్స్ లూధరన్ చర్చిలో పాల్గొన్నారు.
చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ప్రార్థనలు చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఫాదర్స్ పాల్గొన్నారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని ప్రార్ధనలు చేశారు. భువనేశ్వరితో పాటు ఆమె సన్నిహితులు, పలువురుటీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ ప్రార్ధనల తరువాత ఆమె అక్కడ నుంచినేరుగా సీతానగరం వెళనున్నట్లుగా సమాచారం. కాగా చంద్రబాబు అయినప్పటినుంచి భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఆమెతో పాటు కోడలు బ్రాహ్మణి కూడా రాజమండ్రిలోనే ఉంటున్నారు. చంద్రబాబుతో ములాఖత్ అవుతు ఆరోగ్యం గురించి తెలుసుకుంటున్నారు. ఆయన సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. చంద్రబాబు సూచనలతోనే భువనేశ్వరి పలు కార్యక్రమాలు పాల్గొంటున్నారని సమాచారం.