Ayyanna Patrudu : నీకు ఓటేసి గెలిపించినందుకు గుడివాడ ప్రజలు సిగ్గుపడుతున్నారు- కొడాలి నానిపై అయ్యన్న ఫైర్
హరికృష్ణకు టీ మోసిన కొడాలి నాని.. నందమూరి కుటుంబం నాశనాన్ని కోరుకుంటున్నాడు. Ayyanna Patrudu - Kodali Nani

Ayyanna Patrudu - Kodali Nani
Ayyanna Patrudu – Kodali Nani : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో నారా లోకేశ్, భువనేశ్వరి వ్యాఖ్యలను ఉద్దేశించి కొడాలి నాని చేసిన విమర్శలకు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు కౌంటర్ ఇచ్చారు.
కొడాలి నానిపై నిప్పులు చెరిగారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చారు. కొడాలి నానికి సంస్కారం లేదని అయ్యన్నపాత్రుడు ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి కొడాలి నాని లాంటి సన్నాసులకు కనపడదని మండిపడ్డారు.
”కొడాలి నాని పిచ్చి వాగుడు వాగుతున్నాడు. హరికృష్ణకు టీ మోసిన కొడాలి నాని.. నందమూరి కుటుంబం నాశనాన్ని కోరుకుంటున్నాడు. చంద్రబాబు కోసం నిరసనలు చేసే వాళ్లలో బడుగులే ఎక్కువ. కొడాలి నానికి ఓటేసి గెలిపించినందుకు గుడివాడ ప్రజలు సిగ్గుపడుతున్నారు. లోకేశ్ పాదయాత్ర ప్రారంభిస్తానంటే రాజమండ్రి బ్రిడ్జిని రిపేర్ల పేరుతో మూసేశారు.
వైసీపీలోనూ కొందరు మంచి వాళ్లున్నారు. గుట్కా నాని.. రోజా.. అంబటి.. గుడివాడ అమర్నాధ్ లాంటి వాళ్లని మేము ఊపేక్షించం. రింగ్ లేదు.. రోడ్డు లేదు.. అదేం కేసు..? వ్యవస్థలను చేతిలో పెట్టుకుని కేసులు పెడుతున్నారు. 18 రోజులు చంద్రబాబును జైల్లో పెట్టారు. ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారు. చిన్న చిన్న సందుల్లో కూడా 144 సెక్షన్ పెట్టే దిక్కుమాలిన పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం ఉంది” అని నిప్పులు చెరిగారు అయ్యన్నపాత్రుడు.