Kodali Nani : లోకేశ్, భువనేశ్వరిలపై కొడాలి నాని సెటైర్లు.. చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా అంటూ..
చంద్రబాబు అరెస్ట్ అయితే తిరునాళ్లతో తప్పిపోయిన పిల్లాడిలో లోకేశ్ తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తండ్రి కోసం బిత్తర చూపులు చూస్తున్నాడని తమ పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానంటూ బీరాలు పలికిన లోకేశ్ ఇప్పుడు తండ్రి బెయిల్ కోసం తిరుగుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు.

kodali nani
kodali nani – nara bhuvaneswari : ఎప్పుడు రాజకీయంగా వ్యాఖ్యలు చేయని నారా భువనేశ్వరి తన భర్త నారా చంద్రబాబు అరెస్ట్ అయ్యాక కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టుల్లో చుక్కెదురు కావటంతో తండ్రి చంద్రబాబు బెయిల్ కోసం లోకేశ్ ఢిల్లీలోనే ఉన్నారు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ వేసిన క్రమంలో ఢిల్లీలోనే ఉన్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్, చంద్రబాబు భార్య నారా భువనేశ్వరిలపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సెటైర్లు వేశారు.
చంద్రబాబు అరెస్ట్ అయితే తిరునాళ్లతో తప్పిపోయిన పిల్లాడిలా లోకేశ్ తిరుగుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తండ్రి కోసం బిత్తర చూపులు చూస్తున్నాడని.. తమ పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానంటూ బీరాలు పలికిన లోకేశ్ ఇప్పుడు తండ్రి బెయిల్ కోసం తిరుగుతున్నాడు అంటూ ఎద్దేవా చేశారు. పాదయాత్రలో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన లోకేశ్ ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టు తిరుగుతున్నారంటూ సెటైర్లు వేశారు. పాదయాత్ర చేసే లోకేశ్ పై కేసులు పెట్టాల్సిన అవసరం తమకు లేదన్నారు. మా పేర్లు రెడ్ బుక్ రాస్తున్నానని లోకేశ్ చెప్పారు.. కానీ లోకేశ్ పేరును మేం చిత్తు కాగితాల్లో కూడా రాయం అంటూ ఎద్దేవా చేశారు. ఎన్ని కేసులు పెడితే అంత పెద్ద పదవి అని పాదయాత్రలో చెప్పిన లోకేశ్ ఇప్పుడు తన తండ్రి జైలుకెళితే ఎందుకు ఏడుస్తున్నారు? అంటే చంద్రబాబుకు పెద్ద పదవి వద్దా..? అంటూ సెటైరిక్ గా ప్రశ్నించారు.
Also Read : ప్రజలు జగన్ ప్రభుత్వానికి పాడె కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి : నారా లోకేశ్
తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని జైల్లో ఆయన చాలా ఇబ్బందులు పడుతున్నారని భువనేశ్వరి ఇటీవల వ్యాఖ్యానించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అన్యాయంగా అరెస్ట్ చేశారని కానీ తమకు ప్రజల డబ్బులు ఎందుకు.. తానే ఓ సంస్థ (హెరిటేజ్) నడుపుతున్నానని దాంట్లో రెండు శాతం షేర్లు అమ్మితే వందల కోట్ల రూపాయలు వస్తాయి.. మాకు ప్రజల డబ్బులు ఎందుకు..? అంటూ ప్రశ్నించారు.
భువనేశ్వరి వ్యాఖ్యలపై కొడాలి నాని మాట్లాడుతు.. చంద్రబాబుకు అన్ని సౌకర్యాలు కల్పించటానికి అది ఇల్లు కాదు జైలు. జైల్లో ఏమైనా కావాలి అంటే కోర్టును అడగాలి అని ఎద్దేవా చేశారు. రెండు శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్ల రూపాయలు వస్తాయని భువనేశ్వరి అంటున్నారు.. ఆ డబ్బులేమన్నా ప్రజలకు ఇస్తారా అని ప్రశ్నించారు. బాబుతో నేను అంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు చంద్రబాబుతో కలిసి జైలుకు వెళతారా అంటూ సెటైర్లు వేశారు.
Also Read : ఇన్నర్ రింగ్‌రోడ్డు కేసులో A14గా లోకేశ్, ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో