Chandrababu Quash Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు, విచారణ చేసే బెంచ్ ఇదే.. ఊరట లభిస్తుందా?

ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. Chandrababu Quash Petition

Chandrababu Quash Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు, విచారణ చేసే బెంచ్ ఇదే.. ఊరట లభిస్తుందా?

Chandrababu Quash Petition - Supreme Court

Chandrababu Quash Petition – Supreme Court : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో తనపై నమోదైన సీఐడీ ఎఫ్ఐఆర్ కొట్టివేయాలని చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను రేపు(సెప్టెంబర్ 27) సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ పిటిషన్ విచారణపై క్లారిటీ వచ్చింది. ఈ కేసును విచారించే బెంచ్ ఫిక్స్ అయ్యింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టి ఆధ్వర్యంలోని ధర్మాసనం చంద్రబాబు పిటిషన్ ను విచారించనుంది.

కోర్టు నెంబర్ 3, ఐటెమ్ నెంబర్ 61:
కోర్టు నెంబర్ 3లో ఐటెమ్ నెంబర్ 61గా చంద్రబాబు కేసు లిస్ట్ అయ్యింది. రేపు మధ్యాహ్నం ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Also Read..TDP: తెలుగుదేశానికి జీవన్మరణ సమస్య.. క్లిష్ట పరిస్థితులను టీడీపీ ఎలా ఎదుర్కొబోతోంది.. బాలకృష్ణ వల్ల అవుతుందా?

హైకోర్టు తీర్పును సవాల్ చేసిన చంద్రబాబు..
క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దర్యాఫ్తు తుది దశలో జోక్యం చేసుకోలేము అంటూ గత శుక్రవారం క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన పిటిషన్ ను మినీ ట్రయల్ నిర్వహించలేమని పేర్కొంది. 17-ఏ సెక్షన్ చంద్రబాబుకి వర్తించదని వెల్లడించింది.

తన అరెస్ట్ అక్రమం అంటున్న చంద్రబాబు..
చంద్రబాబు చేస్తున్న న్యాయపోరాటం ఎట్టకేలకు దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. బుధవారం సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ పైన రేపు మధ్యాహ్నం విచారణ జరగనుంది. ప్రధానంగా తన అరెస్ట్ చెల్లదని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా అరెస్ట్ చేశారని, హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కన పెట్టాలని చంద్రబాబు తన పిటిషన్ లో పేర్కొన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు చంద్రబాబు. ప్రధానంగా అవినీతి నిరోధక చట్టం 1988 సెక్షన్ 17ఏ ప్రధానంగా ప్రస్తావించారు. తన అరెస్ట్ చెల్లదని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తన అరెస్ట్ జరిగిందని, 17-ఏను పట్టించుకోకుండా తన అరెస్ట్ జరిగిందని, ఎఫ్ఐఆర్ కానీ దర్యాఫ్తు కానీ ఇవేవీ చెల్లవు అన్నది చంద్రబాబు వాదన.

Also Read..Nara Lokesh : రాష్ట్రపతిని కలిసిన నారా లోకేశ్.. చంద్రబాబు అరెస్ట్‌పై ఫిర్యాదు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్..

సుప్రీంలో చంద్రబాబుకి ఊరట లభిస్తుందా?
దీనిపైనే ప్రధానంగా సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది. ఏ అంశాలను అయితే హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదో (17ఏ) వాటన్నింటిని కూడా చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా రేపు సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు ప్రస్తావించబోతున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబుకి ఊరట లభిస్తుందా? లేక ఏపీ ప్రభుత్వానికి, స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ కి నోటీసులు ఇచ్చి కేసు విచారణను వాయిదా వేస్తుందా? అనేది వేచి చూడాలి. మొత్తంగా రేపు మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఒక స్పష్టత రానుంది.