Site icon 10TV Telugu

CM Chandrababu : చంద్రబాబు అన్‌స్టాపబుల్.. తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి 30ఏళ్లు

CM Chandrababu

CM Chandrababu

CM Chandrababu : నారా చంద్రబాబు నాయుడు.. అన్నివర్గాల ప్రజలకు సుపరిచితమైన పేరు. దేశ రాజకీయాల్లో చక్రంతిప్పిన ఆయన.. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న బాబు.. తన రాజకీయ జీవితంలో మరో మైలురానికి చేరుకున్నారు. చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యి నేటికి 30ఏళ్లు.

Also Read: త్రిశూల వ్యూహాన్ని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి మొదలుపెట్టిన పవన్

1995 సెప్టెంబర్ 1న తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి, రెండోసారి కలిపి 2004 మే 29 వరకు.. ఎనిమిదేళ్ల 8 నెలల 13 రోజులు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వ్యవహరించారు. మూడోసారి 2014 జూన్ 8 నుంచి 2019 మే 29 వరకు సీఎంగా చంద్రబాబు పనిచేశారు. నాలుగోసారి 2024 జూన్ 12 నుంచి చంద్రబాబు నాయుడు సీఎంగా కొనసాగుతున్నారు. నేటివరకు మొత్తం 14 ఏళ్ల 11 నెలలు.. అంటే 5,442 రోజులు సీఎంగా చంద్రబాబు కొనసాగుతున్నారు.

15 ఏళ్ల కాలంలో అనేక సంక్షోభాలను పరిష్కరించిన నేతగా చంద్రబాబు గుర్తింపు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ముఖ్యమంత్రి పదవీకాలంలో హైటెక్ సిటీ, సైబరాబాద్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్డుతో.. హైదరాబాద్ రూపురేఖలను చంద్రబాబు మార్చేశారు. నాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీ.. నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీకి చంద్రబాబు రూపకల్పన చేశారు.

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటులో చంద్రబాబు నాయుడు కింగ్ మేకర్ పాత్ర పోషిస్తున్నారు. 2024లో సీఎం అయ్యాక సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నారు. అమరావతి, పోలవరం నిర్మాణాలతోపాటు విశాఖను ఆర్థిక, ఐటీ రాజధాని, రాయలసీమను పారిశ్రామిక కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. చంద్రబాబు సీఎంగా తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు అవుతున్న సందర్భంగా పిడుగురాళ్లలో మహిళలతో ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు భారీ సభ ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాజంపేటలో పెన్షన్ల పంపిణీలో చంద్రబాబు పాల్గోనున్నారు.

Exit mobile version