త్రిశూల వ్యూహాన్ని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి మొదలుపెట్టిన పవన్
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలతో వచ్చిన గ్యాప్, మాజీ ఎమ్మెల్యే వర్మతో ఉన్న విభేదాల నేపథ్యంలో పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్రిశూల వ్యూహాన్ని తన సొంత నియోజకవర్గం పిఠాపురం నుంచి మొదలు పెట్టారు. జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యారు.
పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ నేతలతో వచ్చిన గ్యాప్, మాజీ ఎమ్మెల్యే వర్మతో ఉన్న విభేదాల నేపథ్యంలో పార్టీపై ఫుల్ ఫోకస్ చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిస్థితులు నాయకులు, కార్యకర్తల సమన్వయం భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలు నాయకులకు దిశా నిర్దేశనం చేశారు.
టీడీపీ నేత వర్మతో భవిష్యత్తులో సమస్యలు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పిఠాపురం నియోజకవర్గంలో జనసేన బలోపేతంపై ఈ సమావేశం నుంచే శ్రీకారం చుట్టారు.