Nara Devaansh – Dino Deets: నారా దేవాన్ష్ కొత్త యూట్యూబ్ ఛానల్.. Dino Deets ప్రారంభం..
దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి నేను ఒక ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Nara Devaansh – Dino Deets: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు నారా దేవాన్ష్ కొత్త యూట్యూబ్ ఛానల్ ”Dino Deets” ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఒక టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్లో దేవాన్ష్ తండ్రి లోకేశ్ కూడా భాగమయ్యారు. కొత్త యూట్యూబ్ చానల్ ప్రారంభించిన దేవాన్ష్ కు నారా-నందమూరి కుటుంబసభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ”Dino Deets” టీజర్లో పాలు పంచుకున్న మంత్రి నారా లోకేష్.. దేవాన్ష్ యూట్యూబ్, పాడ్ కాస్ట్ ప్రత్యేకతలు తెలుసుకున్నారు.
డైనోసార్లు, శిలాజాలు, పురాతన అవశేషాల గురించి తాను తెలుసుకున్న ఆశ్చర్యపరిచే నిజాలు, డైనోసార్ల వింతలు-విశేషాలు ఆకట్టుకునే శైలిలో, నవ్విస్తూ, ఆలోచింపజేసేలా దేవాన్ష్ అందించే పాడ్ కాస్ట్‌లు ఈ యూట్యూబ్ చానల్ లో ప్రసారం కానున్నాయి. దేవాన్ష్ సృష్టించిన ప్రాచీన ప్రపంచంలోకి నేను ఒక ప్రేక్షకుడిలా ప్రవేశించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియాలో తెలిపారు.
యూట్యూబ్ చానల్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన నారా దేవాన్ష్ చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్‌ను వేగంగా పరిష్కరించడం ద్వారా ‘ఫాస్టెస్ట్ చెక్‌మేట్ సాల్వర్’గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించిన సంగతి తెలిసిందే. ‘5334 ప్రాబ్లమ్స్ అండ్ గేమ్స్’ పుస్తకంలోని 175 సంక్లిష్టమైన చెక్‌మేట్ పజిల్స్‌ను గతేడాది దేవాన్ష్ వేగంగా పరిష్కరించి ఈ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.
Dino Deets.. చానెల్ లింక్స్
YouTube – https://youtube.com/@dinodeets
Instagram – https://www.instagram.com/dinodeets/
Facebook – https://www.facebook.com/DinoDeets/
#DinoDeets
#DevaanshPodcast
Also Read: ట్రంప్ చేసిన పని.. ‘మా డబ్బులెప్పుడిస్తావ్..?’ అమెజాన్ మీద కేసులేస్తున్న జనం..
