nara-lokesh..chandrababu bail
nara-lokesh..chandrababu bail : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు ఎట్టకేలకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.దీంతో చంద్రబాబు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో నారా లోకేశ్ ఆయన భార్య బ్రాహ్మణితో కలిసి రాజమండ్రి చేరుకున్నారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాక చంద్రబాబు సాయంత్రం 4గంటల సమయంలో జైలు నుంచి బయటకు రానున్నారు. ఈ ఆనందంలో లోకేశ్ మాట్లాడుతు..యుద్ధం ఇప్పుడే ప్రారంభమైందన్నారు. రాజమండ్రి చేరుకున్న లోకేశ్ కు ఎయిర్ పోర్టులో టీడీపీ నేతలు స్వాగతం పలికారు.
చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై ఆనందం వ్యక్తం చేస్తు లోకేశ్ కు అభినందనలు తెలిపారు. టీడీపీ నేతలు, కార్యకర్తలతో లోకేశ్ మాట్లాడుతు..యుద్ధం ఇప్పుడే మొదలైంది అంటూ వ్యాఖ్యానించాటంతో అందరు జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి లోకేశ్, బ్రాహ్మణి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. తండ్రిని దగ్గరుండి అమరాతి తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. చంద్రబాబు బయటకు రానుండటంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు.
దీనిపై టీడీపీ నేతలు మాట్లాడుతు..చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారని ..ఇప్పటికైనా బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. మా నేతను ఊరేగింపుగా తీసుకెళ్లేందుకు అన్ని ఏర్పాటు చేశామని తెలిపారు.