×
Ad

జగన్ ను పట్టుకోమనా బొత్స ఉద్దేశం?: నారా లోకేశ్

"అంటే జగన్ గజ దొంగ అని బొత్స చెబుతున్నారా? జగన్ ను పట్టుకోవాలని బొత్స చెబుతున్నారా?" అని అన్నారు.

  • బాబాయ్‌ను చంపి కత్తిని మా చేతిలో పెట్టారు
  • ఇప్పుడు వీఎస్ఆర్ ఏవియేషన్ పై ఆరోపణలు
  • హెరిటేజ్‌కు, వీఎస్ఆర్ ఏవియేషన్‌కు సంబంధం లేదు 

Nara Lokesh: వైసీపీ సర్కారుపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ అమరావతిలో మీడియా ప్రతినిధులతో నారా లోకేశ్‌ చిట్ చాట్‌లో పాల్గొన్నారు.

“బాబాయ్‌ను చంపి కత్తిని మా చేతిలో పెట్టారు. ఇప్పుడు వీఎస్ఆర్ ఏవియేషన్ పై వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా అలాంటివే. హెరిటేజ్ కు వీఎస్ఆర్ ఏవియేషన్‌కు ఎటువంటి సంబంధం లేదు. హెరిటేజ్ ఫిన్ లీస్ అనేది 1996లో స్థాపించిన సంస్థ. 2022లో వీఎస్ఆర్ ఏవియేషన్ హెరిటేజ్ ఫిన్ లీస్ వద్ద ఫైనాన్స్ తీసుకుంది. అనేక ఇతర సంస్థల మాదిరిగానే వీఎస్ఆర్ కూడా ఫైనాన్స్ తీసుకుంది.

ఆ రోజు మేము అధికారంలోకి వస్తామని, మా ఎంపీ ఏవియేషన్ మంత్రి అవుతారని, అజిత్ పవార్ వీఎస్ఆర్ ఫ్లైట్ ఎక్కుతారని, అది యాక్సిడెంట్ కు గురి అవుతుందని కలగన్నామా? మేము ఏమన్నా జ్యోతిష్యులమా?

Also Read: Somireddy: మదనపల్లి ఫైల్స్‌కు మించి సర్వేపల్లి ఫైల్స్.. నేరుగా ఆయన రంగంలోకి దిగాల్సిందే: సోమిరెడ్డి

జగన్ చేసే ప్రతి నిరాధార ఆరోపణకి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రతి ప్రశ్నకు ధీటైన సమాధానం చెబుతాం. వీఎస్ఆర్ ఏవియేషన్ వ్యవహారం పై పూర్తి వివరాలు మీకు అందిస్తాను. చిల్లర దొంగలను పట్టుకొని గజ దొంగలను వదిలిస్తున్నారు.

అంటే జగన్ గజ దొంగ అని బొత్స చెబుతున్నారా? జగన్ ను పట్టుకోవాలని బొత్స చెబుతున్నారా? సిట్ విచారణలో తేలింది అంతా అదే కదా. మా మీద ఆరుకు పైగా కేసులు పెట్టారు. ఫైబర్ నెట్, స్కిల్ ,ఇన్నర్ రింగ్ రోడ్, లిక్కర్,ఇసుక,అసైన్మెంట్ భూములులపై కేసులు పెట్టారు.

చార్జిషీట్ దాఖలు చేసేటప్పుడు కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం పొందాలి. మంత్రులకు అయితే గవర్నర్.. ఎమ్మెల్యే లు అయితే స్పీకర్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. గవర్నర్ కు ఆధారాలు ఎందుకు చూపలేదు? ఒక్క ఆధారమైనా చూపారా? వాళ్లు పెట్టినవన్నీ తప్పుడు కేసులు” అని అన్నారు.