రెండు నెలలు ఓపిక పట్టండి.. వచ్చేది మన ప్రభుత్వమే.. ప్రతియేటా డీఎస్సీ నిర్వహిస్తాం

నిరుద్యోగులకు హామీ ఇస్తున్న రానున్న ఎన్నికల్లో విజయం మనదే.. రెండు నెలలు ఓపికపట్టండి.. మనం అధికారంలోకి రాగానే ప్రతీయేటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ అన్నారు.

NARA lOKESH

Nara Lokesh Sankharavam Yatra : శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శంఖారావం యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా స్థానిక సురంగిరాజా మైదానంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు. జగన్ ఎన్నికల ముందు కొత్తనాటం మొదలు పెట్టాడని, ఆ నాటకమే డీఎస్సీ. నాలుగు సంవత్సరాల పదినెలలు ఒక్క డీఎస్సీ ఇవ్వలే.. డీఎస్సీ అనే పదం ఆయన నోటినుంచి రాలేదని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మోసానికి, దగా, కుట్రకు పాయింట్, షర్ట్ వేస్తే అచ్చం జగన్ లా ఉంటుందని లోకేశ్ అన్నారు. గత ఎన్నికల ముందు 23వేల డీఎస్సీ పోస్టులు ఇస్తామని హామీ ఇచ్చాడు.. అధికారంలోకి వచ్చాక.. కేవలం 18వేల పోస్టులు ఉన్నాయన్నారు.. దానితరువాత 117 జీవో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనలైజేషనల్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి జగన్ అని లోకేశ్ విమర్శించారు. ఇప్పుడు ఎన్నికల సమయంలో యువతలో యువగళం మొదలైంది.. అందుకే నామమాత్రంగా ఆరువేల పోస్టులు ఇస్తామని అంటున్నాడు. ఎన్టీఆర్ హయాంలో, చంద్రబాబు హయాంలో మొత్తం 1.70లక్షల పోస్టులు భర్తీ చేశారు. నిరుద్యోగులకు హామీ ఇస్తున్న రానున్న ఎన్నికల్లో విజయం మనదే.. రెండు నెలలు ఓపికపట్టండి.. మనం అధికారంలోకి రాగానే ప్రతీయేటా డీఎస్సీ నిర్వహిస్తామని లోకేశ్ అన్నారు.

Also Read : Minister Komatireddy Venkat Reddy : ప్రజలకు క్షమాపణలు చెప్పాకే కేసీఆర్ నల్గొండలో అడుగు పెట్టాలి

ఎర్రబుక్కు చూసి అందరూ భయపడుతున్నారు.. నాపై ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లేదు. జైల్లో పెడితే చంద్రబాబు భయం బయోడేటాలో లేదని చెప్పారు. పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టేది లేదు, వడ్డీతో సహా చెల్లిస్తాం. జ్యూడీషియల్ ఎంక్వైరీవేసి సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తాం అని లోకేశ్ హెచ్చరించారు. ఉత్తరాంధ్ర అమ్మలాంటిది. టీడీపీ ఉత్తరాంధ్ర ను జాబ్ క్యాపిటల్ గా చేస్తే.. సైకో జగన్ ఉత్తరాంధ్రను గంజాయి క్యాపిటల్ గా మార్చాడంటూ లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ సిద్ధం అంటున్నావ్.. దేనికి సిద్ధం? జగన్ జైలుకు వెళ్లడానికి సిద్ధం.. సొంత బాబాయ్ ని లేపేశారు.. ఇంకెంతమందిని లేపేయడాదనికి సిద్ధం? అంటూ లోకేశ్ ప్రశ్నించారు.

Also Read : YSRCP: పలు పార్లమెంట్ నియోజక వర్గాలు, జిల్లాల కోఆర్డినేటర్లను నియమించిన వైసీపీ

జగన్ మోహన్ రెడ్డికి మైథోమానియా సిండ్రోమ్ అనే జబ్బు ఉంది.. సొంత సంస్థలు ఉన్నవారు పేదవాడు అవుతాడా? అంటూ లోకేశ్ ప్రశ్నించారు. షర్మిల, సునీతలకే భద్రతలేదు.. ఇక మన పరిస్థితి ఏమింటో ప్రజలు ఆలోచించాలని అన్నారు. కటింగ్, ఫిటింగ్ మాస్టర్ జగన్.. పైకి బటన్ నొక్కుతానంటాడు.. కింద ఛార్జీలు బాదుడు వేసి వెనక్కి లాగేస్తాడు అంటూ లోకేశ్ విమర్శించారు. వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి జగన్. ప్రజల ఇబ్బందులు ఆయనకు పట్టవని లోకేశ్ అన్నారు. మనం అధికారంలోకి రాగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. నిరుద్యోగులకు మూడువేలు అందిస్తామని లోకేశ్ చెప్పారు. విశాఖ ఉక్కు భూములను కాజేయాలని జగన్ అండ్ కో చూస్తున్నారు. శ్రీకాకుళంకు 60 హామీలు ఇచ్చారు.. ఒక్కటైనా పూర్తిచేశారా అంటూ ప్రశ్నించారు. మాట ఇచ్చి మడమ తిప్పాడు. ఐదేళ్లలో ఇచ్చాపురంకు వైసీపీ చేసిందేంటి ?. మనం అధికారంలోకి రాగానే వంశధార – బహుదా నదుల అనుసంధానం చేస్తాం, ఉద్దానంకు నీరందిస్తాం. జీడి పంటలకు మద్దతు ధరనిస్తాం. రెండు నెలలు ఓపికపడితే సైకో జగన్ తీసేసిన అన్ని పథకాలు పునరుద్దరిస్తామని లోకేశ్ అన్నారు.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు