Nara Lokesh: ఇది పెన్నానది ఇసుక కోసం వెళ్తున్న ఇసుకాసురుల టిప్పర్ లారీ: నారా లోకేశ్

ఇసుక లోడ్ చేసుకున్నాక ఎక్కడికి తీసుకెళ్తారని అడిగితే బెంగుళూరు వెళ్తామని డ్రైవర్ సమాధానమిచ్చారని లోకేశ్ చెప్పారు.

Nara Lokesh

Nara Lokesh – Selfie Challenge: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వంపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని ఆయన చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, కడప జిల్లా (Kadapa) బద్వేలు (Badvel)లో తాను పర్యటిస్తుండగా, ఇసుక టిప్పర్ లారీ కనపడిందని లోకేశ్ చెప్పారు. దానితో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశారు.

” వైసీసీ ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిల. వైసీపీ ఇసుకాసురుల దెబ్బకు పెన్నానది విలవిలలాడుతోంది. పత్రికలు ఘోషిస్తున్నా, ప్రజలు మొరపెట్టుకుంటున్నా వైసీపీ ఆగడాలు ఆగడం లేదు. ఇది బద్వేలు నియోజకవర్గంలోని లింగాలకుంట వద్ద పెన్నానది ఇసుక కోసం వెళ్తున్న టిప్పర్ లారీ.

ఇసుక లోడ్ చేసుకున్నాక ఎక్కడికి తీసుకెళ్తారని అడిగితే బెంగుళూరు వెళ్తామని డ్రైవర్ సమాధానమిచ్చారు. ఇక్కడ ఇసుక కూతవేటు దూరంలోని గ్రామ ప్రజలకు దొరకదు కానీ, చెన్నై, బెంగుళూరులో మాత్రం విరివిగా దొరుకుతుంది. జలగన్న పాలనలో జనం ఇంకా ఎన్ని సిత్రాలు చూడాలో ” అని లోకేశ్ ట్వీట్ చేశారు.

శనివారం కూడా నారా లోకేశ్ ఓ సెల్ఫీ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా రాజంపేటలో పర్యటించిన సందర్భంగా డంపింగ్ యార్డ్ వద్ద సెల్ఫీ తీసుకున్నారు. రాజంపేటలోని జంగాలపల్లెలో ఇసుక డంపింగ్ యార్డ్ ఉందని, మినీ సాండ్ మహల్ ను నిర్మించడానికి వైసీపీ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి పలు చర్యలకు పాల్పడ్డారని లోకేశ్ ఆరోపించారు.

Southwest Monsoon : ఏపీకి చల్లని కబురు.. నైరుతి రుతుపవనాలు వచ్చేశాయోచ్