Nara Lokesh: ఇసుక డంపింగ్ యార్డ్ వద్ద నారా లోకేశ్ సెల్ఫీ.. ఎందుకంటే?

" ఇది రాజంపేటలోని జంగాలపల్లెలో ఉన్న ఇసుక డంపింగ్ యార్డ్. ఇక్కడే.. " అంటూ లోకేశ్ పలు విషయాలు చెప్పారు.

Nara Lokesh

Nara Lokesh – Selfie Challenge: టీడీపీ (TDP) నేత నారా లోకేశ్ మరోసారి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా (Annamayya district) రాజంపేట (Rajampet)లో పర్యటించిన లోకేశ్ ఈ సందర్భంగా డంపింగ్ యార్డ్ వద్ద సెల్ఫీ తీసుకున్నారు.

” ఇది రాజంపేటలోని జంగాలపల్లెలో ఉన్న ఇసుక డంపింగ్ యార్డ్. ఇక్కడే.. మినీ సాండ్ మహల్ ను నిర్మించడానికి వైసీపీ ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి పెన్నా నది వద్ద తొవ్వకాలు జరిపారు. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాము ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక కొనే పరిస్థితి లేదని అంటున్నారు. ఎమ్మెల్యే మద్దతుతో చాలా లారీల్లో ఇసుకను బెంగళూరు, హైదరాబాద్ కు తీసుకెళ్తున్నారు ” అని లోకేశ్ చెప్పారు.

ఇప్పటికే పలుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌(Jagan)కు లోకేశ్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఇటీవల “పాలకొండను మింగేసిన వైసీపీ అనకొండలు ” అని పేర్కొంటూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. వైసీపీ నేతల కంటిపడితే కొండలు, గుట్టలు మాయమైపోతున్నాయని లోకేశ్ అన్నారు.

Anam Ramanarayana Reddy : టీడీపీలోకి ఆనం.. ప్రకటన అప్పుడే?